కొర‌టాల శివ.. ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అస‌రం లేని పేరు. చేసింది త‌క్కువ సినిమాలే అయినా అన్ని చిత్రాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డంలో స్టార్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. బీటెక్ పూర్తిచేసిన శివ, ఆరునెలలు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసాడు. అయితే ఆ త‌ర్వాత బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర 1998లో సహాయకుడిగా చేరాడు. కథలు రాయడంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. ఐదేళ్లు కష్టపడి మంచి రైటర్ గా రాటుదేలాడు. ఈ క్ర‌మంలోనే ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం మరియు ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు.

 

అయితే అప్ప‌టి వ‌ర‌కు సహాయ రచయితగా రాణించిన శివ.. ఆతర్వాత తానె సొంతంగా కథ రాసుకుని 2013లో మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు. ప్రభాస్ హీరోగా వచ్చిన ఆ సినిమా హిట్ అవ్వడంతోనే తొలిచిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన మ‌హేష్ బాబుతో శ్రీమంతుడు, ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్, మ‌ళ్లీ మ‌హేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇలా కొర‌టాల పోసాని మురళి దగ్గర శిష్యరికం చేస్తూ పలు చిత్రాలకు రచనసహకరం అందింస్తుండే వారు. ఆ త‌ర్వాత అదే పోసాని అండ‌దండ‌ల‌తో టాలీవుడ్‌లో నిల‌దొక్కుకుని స్టార్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రిగా నిలిచారు. 

 

మ‌రి పోసాని కృష్ణ మురళికి స్వ‌యాన మేనల్లుడు అయిన కొరటాల శివకు మ‌ధ్య గొడ‌వేంట‌ని అనుకుంటున్నారా..? వాస్త‌వానికి కొర‌టాల సినిమాలో పోసానికి క్యారెక్ట‌ర్ ఇవ్వ‌డు. అయితే ఎందుకు ఇవ్వ‌వు అని పోసాని మురళి కృష్ణ ప్ర‌శ్నించ‌గా.. దానికి కొర‌టాల నాకు ఇవ్వాల్సిన వ‌చ్చిన‌ప్పుడే ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. మ‌రియు మంచి ప్రేయార్టి ఉన్న క్యారెక్ట‌ర్ మాత్ర‌మే ఇవ్వాలి.. ఏదో చిన్నాచిత‌క క్యారెక్ట‌ర్‌ ఇస్తే.. ఆయ‌న‌ నాతో గొడ‌వ‌ప‌డ‌తాడు.. ఎందుకంటే అత‌ను కూడా స్వ‌తాహాగా రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ క‌దా అంటూ స‌ర‌దాగా చెప్పుకొచ్చారు కొర‌టాల శివ‌. కాగా, ప్ర‌స్తుతం కొర‌టాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే.

 


 


 

మరింత సమాచారం తెలుసుకోండి: