సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ , మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్  క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో తెరకెక్కిన  చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం  విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ చిత్రం155నిమిషాల 37సెకండ్ల నిడివితో ప్రేమికుల రోజున, ఈనెల 14న  ప్రేక్షకులముందుకు రానుంది. నాలుగు ప్రేమ కథల ఆధారంగా  రానున్న ఈ చిత్రంలో విజయ్ సరసన ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ ట్రెసా ,ఇజబెల్లా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించగా గోపి సుందర్ సంగీతం అందించాడు. క్రియేటివ్ కమ్మర్షియల్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించాడు.  
 
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ , ట్రైలర్లు రొటీన్ గా ఉండడం తో సినిమా కు  రావాల్సిన బజ్ మాత్రం రావడం లేదు. అయితే విజయ్ మాత్రం ఈ సినిమా విజయం సాదిస్తుందని కాన్ఫిడెంట్ గానే వున్నాడు. ఇక  గత ఏడాది  డియర్ కామ్రేడ్  తో ప్రేక్షకులముందుకు  వచ్చిన విజయ్ కి  ఆ చిత్రం  భారీ షాక్ ఇచ్చింది.  మంచి అంచనాలతో విడుదలైన ఆసినిమా  డిజాస్టర్ ఫలితాన్ని రాబట్టింది. మరి ఇప్పుడు ఈ ఫేమస్ లవర్ తోనైనా విజయ్ హిట్ కొడతాడో లేదో చూడాలి.  
 
ఇదిలా ఉంటే  ప్రస్తుతం విజయ్ , డ్యాషింగ్  డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తన 10వ సినిమాలో నటిస్తున్నాడు. ఈచిత్రం బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతుండగా .. ఇటీవలే ఈ సినిమా  షూటింగ్  ముంబై లో  స్టార్ట్ అయ్యింది. కాగా క్రేజీ  కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడం తో ఈ సినిమా  పై భారీ అంచనాలు వున్నాయి.  పూరి జగన్నాథ్, ఛార్మి తో కలిసి కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు దాంతో ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ లోనూ విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: