ఒక మోస్తారుగా ఉంటే ఆడియెన్స్ దృష్టిలో పడటం కష్టమని భావిస్తున్న భామలు తమని తాము ఎప్పుడూ కొత్తగా ప్రెజెంట్ చేసుకుంటున్నారు. ఎప్పుడూ ఒకేలా కనిపిస్తే ఎలా అనుకున్నారో ఏమో కొత్త కొత్త స్టైల్ తో సినీ వేడుకలకు వస్తారు. ఇక హీరోయిన్s అంతా ఫాలో అయ్యే కలర్ ఫార్ములా రెడ్ డ్రెస్.. వేరే కలర్ అయితే ఆడియెన్స్ కళ్ళకు ఆనదని అనుకుంటారో ఏమో కాని ఏదైనా ఈవెంట్ అంటే చాలు రెడ్ కాస్టూమ్ తో దర్శనమిస్తారు.  

 

తాము ఇంత కష్టపడి తయారై వస్తే ఎవరు చూడకపోతే ఎలా అనుకుంటారో ఏమో అందుకే జిగేల్ జిగేల్ అనిపించే రెడ్ డ్రెస్ లో అదరగొడతారు. ఈమధ్య ఏ హీరోయిన్ చూసినా సరే రెడ్ డ్రెస్ లోనే కనిపిస్తుంది. కాజల్ రెడ్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకోగా.. ఈమధ్య ఆహా OTT లాంచ్ ఈవెంట్ లో రెడ్ డ్రెస్ లో చూపరులను ఆకట్టుకుంది. రెడ్ డ్రెస్ లో వచ్చిన కుమారి హెబ్భా అందరిని ఆకట్టుకుంది. 

 

ఇక లేటెస్ట్ గా రాశి ఖన్నా కూడా వరల్డ్ ఫేమస్ లవర్ ఈవెంట్ లో రెడ్ కాస్టూమ్ తో అలరించింది. ఓ విధంగా చెప్పాలంటే వీళ్లంతా డ్రెస్ మీద ఇష్టం కన్నా కలర్ మీదే ఎక్కువ మోజుతోనే ఇలా సేమ్ కలర్ డ్రెస్ లో కనిపించారు. ఎరుపు కలర్ లో ఉన్న మ్యాజిక్ ఏంటో కాని అది వేసుకున్న హీరోయిన్స్ మాత్రం సూపర్ హిట్ కొట్టేస్తున్నారు. ఈ ఎరుపు కలర్ ప్రమోషన్స్ కూడా హీరోయిన్స్ కు బాగా కలిసి వచ్చేలా ఉంది. ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ మాత్రమే కాదు ఫామ్ లో లేని హెబ్బా కూడా ఈ రెడ్ డ్రెస్ సీక్రెట్ తెలిసినట్టు ఉంది. అందుకే ఇలా తనని తాను ప్రమోట్ చేసుకుంటుంది. మరి ఈ ఎరుపు ప్రమోషన్ ఎలా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: