ఎస్‌.ఎస్. రాజ‌మౌళి ఈ పేరు వింటే చాలు టాలీవుడ్‌లో అప‌జ‌యం ఎరుగ‌ని ధీరుడు.. తెలుగు ఇండ‌స్ట్రీలో సునామీలు సృష్టించే సూర్యుడు.. విజ‌యాల ప‌రంప‌ర‌లో ప‌య‌నిస్తున్న విక్ర‌మార్కెడు.. తెలుగు సినిమా ఖ్యాతిని న‌లుదిక్కులు వ్యాపింప‌చేసే మ‌గ‌ధీరుడు..ఎటువంటి క‌థ‌నైనా స‌రే త‌న‌దైన శైలిలో భ‌యంలేకుండా తీసే బాహుబ‌లి క‌నిపిస్తాడు. మ‌న బాహుబ‌లి గుర్తుకువ‌స్తాడు. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, రాజ‌నందిని దంప‌తుల‌కు రాయ‌చూరులో జ‌న్మించాడు రాజ‌మౌళి. సొంతూరుప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు. తండ్రి సినిమా రంగంలో ఉండ‌డంతో ఈ రంగం పైనే ఆయన‌కు చిన్న‌ప్ప‌టి నుంచి మ‌క్కువ ఎక్కువ‌. ర‌చ‌యిత‌గా ఉన్న విజ‌యేంద‌ర‌ప్ర‌సాద్ వాళ్ళ నాన్న‌గారి ద‌గ్గ‌రే రాజ‌మౌళి కొన్ని రోజులు ప‌ని చేశారు. సినిమా విజ‌యానికి ఎడిటింగ్ కూడా ఒక కార‌ణ‌మ‌ని రాజ‌మౌళి తెలుసుకున్నారు. ముందు ఆయ‌న ఎడిటింగ్ వ‌ర్క్ నేర్చుకున్నారు. ఆ త‌ర్వాత రాఘ‌వేంద్ర‌రావు ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. స్టూడెంట్ నెం. 1 చిత్రంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌మౌళి ప్రాణ‌స్నేహితులుగా మారిపోయారు. ఆచిత్రం వారిద్ద‌రి కెరియ‌ర్‌కి ఒక మైలురాయిగా నిలిచింద‌ని చెప్పాలి. 

 

త‌ర్వాత నాని హీరోగా, స‌మంత హీరోయిన్ వ‌చ్చిన ఈగ చిత్రం చూసి తెలుగు ప్రేక్ష‌కులే కాదు. ఇటు కోలీవుడ్, బాలీవుడ్ హీరోలు సైతం ఆశ్చ‌ర్య‌పోయి రాజ‌మౌళి గురించి ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. ఇక ఈ ఈగ చిత్రంతో రాజ‌మౌళికి హీరోల‌తో ప‌నిలేద‌ని కేవ‌లం క‌థ‌ల‌ను మాత్ర‌మే న‌మ్మి సినిమాలు తీస్తాడ‌ని అంద‌రికి అర్ధ‌మ‌యిపోయింది. బాహుబ‌లి సినిమాని రాజ‌మౌళి చెక్కారు అనేదానికంటే ఆయ‌న తెలుగు సినిమా ఖ్యాతిని చెక్కార‌నే చెప్పాలి. సౌత్ ఇండియాలోనే హైఎస్ట్ బ‌డ్జెట్ సినిమాగా నిలిచింది బాహుబ‌లి చిత్రం. హాలీవుడ్ దిగ్గ‌జాల‌ను సైతం తెలుగు సినిమావైపు చూసేట‌ట్టు చేశాడంటే అది కేవ‌లం రాజ‌మౌళికి మాత్ర‌మే సాధ్యం. ఇప్పుడు చాలా మంది భార‌తీయ సినిమావాళ్ళంద‌రూ రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఎదురు చూస్తున్నారు. తార‌క్, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా 2021లో రాబోతున్న ఆర్‌.ఆర్‌.ఆర్ చిత్రం మ‌రెన్ని రికార్డులు సాధిస్తుందో వేచి చూడాల్సిందే. 

 

ఇక ఇదిలా ఉంటే... ఇంత క్రియేటివిటీ ఉన్న ఇన్ని తెలివితేట‌లున్న‌రాజ‌మౌళికి కాస్త మ‌తిమ‌రుపు ఉంద‌ట‌. నిజ‌మండి ఇటీవ‌లె ఆయ‌న స‌తీమ‌ణి ర‌మారాజ‌మౌళి మీడియాకి ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఎక్కువ క్రియేటివిటీ ఉండ‌డం వ‌ల్ల ఆయ‌న చిన్న చిన్న విష‌యాల‌ను మ‌రిచిపోతార‌ని ఆమె అన్నారు. ఆయ‌న భోజ‌నం చేయ‌డం ఒక్కోసారి మ‌రిచిపోతార‌ని దాంతో ఆమె స్వ‌యంగా వండి సెట్‌కి తీసుకువెళ‌తారని చెప్పారు. అలాగే బ‌య‌ట‌కు వెళ్ళే స‌మ‌యంలో కూడా ఒక్కోసారి డ‌బ్బులు జేబులో పెట్టుకోకుండానే మ‌రిచిపోయి వెళ‌తార‌ని... వేరేవాళ్ళ ఇళ్ళ‌కు వెళ్ళిన‌ప్పుడు మ‌రిచిపోయి వారి వ‌స్తువుల‌ను తీసుకువ‌స్తార‌ని న‌వ్వుతూ స‌ర‌దాగా ఒక ఉదాహ‌ర‌ణ చెప్పారు. ఇటీవ‌లె ఒక‌సారి కె.ఎస్ ర‌వికుమార్ నిర్మాత ఇంటికి మాట్లాడ‌టానికి వెళ్ళి మారిచిపోయి వాళ్ళ రిమోట్‌ని ఆయ‌న జేబులో పెట్టుకుని వ‌చ్చేశార‌ని చెప్పారు. ఇలా చిన్న చిన్న‌వి ఆయ‌న‌కు గుర్తుండ‌వ‌ని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: