టాలీవుడ్ నెంబర్ వన్, నెంబర్ టూ దర్శకులు, రాజమౌళి, వివి వినాయక్. టాలీవుడ్ లో వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా.. ఈ ఇద్దరి సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ డ్రాప్ స్టోరీస్, హీరోల, విలన్ ల పవర్ ఫుల్ క్యారెక్టరైజన్ ఎవరికి వారే సాటి అని చెప్పాలి. అయితే ఇద్దరూ మాస్ సినిమాలను, హీరోయిజాన్నినమ్ముకొని ఈ పొజిషన్ కి చేరారు. ఇక రాజ‌మౌళిది, వి.వి.వినాయ‌క్ ఇద్ద‌రిదీ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లానే. రాజ‌మౌళిది కొవ్వూరు అయితే వినాయ‌క్‌ది చాగ‌ల్లె.  అలాగే ఇద్ద‌రూ కూడా ఒకేసారి తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టారు. స్టూడెంట్ నెం1. చిత్రంతో రాజ‌మౌళి 2001లో అడుగుపెడితే 2002లో ఆది సినిమాతో అడుగు పెట్టారు. ఇద్ద‌రూ కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్‌తోనే సినిమాలు తీసి ఫ‌స్ట్ సినిమానే హిట్ కొట్ట‌రు. అందుకే వారిద్ద‌రి మ‌ధ్య అంత మంచి అనుబంధం ఉంది. ఇటీవ‌లె రాజ‌మౌళిని ఒక ఇంట‌ర్వ్యూలో వినాయ‌క్ ఇష్ట‌మా లేక త్రివిక్ర‌మ్ ఇష్ట‌మా అని అడిగితే విన‌య్ అని నిర్మొహమాటంగా చెప్పాడు. ఇద్ద‌రూ కూడా ఎప్పుడూ రెగ్యుల‌ర్‌గా క‌లుసుకుంటారు. వారికి ఉన్న అభిమానాన్ని ఒక‌రి పై ఒక‌రు చాటుకుంటారు.

 

అయితే వీరిద్ద‌రి మ‌ధ్య ఉండే సినిమాల విష‌యంలో చిన్న తేడా ఉంటుంది అదేమిటంటే... యాక్షన్ సీన్ కో, ప్రతి పాటకో ఏర్పరుచుకోవాల్సిన బలమైన ఎమోషన్ ని, లీడింగ్ సీన్ ని అల్లుకోవడంలో రాజమౌళికున్న కమాండ్ v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ లోని ఏ చిత్రంలోనూ అంత బలంగా కనిపించలేదు. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ ని, హీరోయిజాన్ని నమ్ముకుంటే అన్ని వేళలా వర్కవుట్ కాదేమో కానీ బలమైన ఎమోషన్ ని పండించగలిగితే సినిమా సక్సెస్ ట్రాక్ మీదే ఎల్లవేళలా నడుస్తుందని రాజమౌళి ప్రతి చిత్రం చెబుతుంది. 

 

అందుకే v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ కి రాజమౌళికి  సినిమాల విష‌యం వ‌చ్చేస‌రికి అసలు పోటి అయితే ఉండ‌దు.  ఇక ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఆర్‌.ఆర్‌.ఆర్. చిత్రం తెర‌కెక్కించే బిజీలో ఉన్నారు. ఆ చిత్రాన్ని ఎలాగైనా స‌రే 2021లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే వినాయ‌క్ తాను హీరోగా న‌టిస్తున్న సేన‌య్య చిత్రంతో బిజీగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: