రకుల్ ప్రీత్ సింగ్ లాజిక్ అర్థం చేసుకున్నా అంటోంది. సౌత్ ఇండస్ట్రీ గురించి తెలుసుకున్న కనుకే రెమ్యునరేషన్ విషయంలో ఎప్పుడూ బెట్టు చేయలేదట. సౌత్ లో ఆల్ మోస్ట్ ఫేడవుట్ అయిన ఈ బ్యూటీ బాలీవుడ్ పై బోలెడు ఆశలు పెట్టుకుంది. ఇంతకీ రకుల్ కు ఆర్థమైన ఆ లాజిక్ ఏంటో తెలుసా.. 

 

లక్ తో రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది. కట్ చేస్తే ఎంత త్వరగా స్టార్ హీరోయిన్ అయిందో అంతే త్వరగా క్రేజ్ కోల్పోయింది. ఒకానౌక సమయంలో రకుల్, మహేశ్ బాబు సినిమాకే డేట్లు లేవంటూ చెప్పేసింది. ఆ తర్వాత  స్పైడర్ సినిమాలో ప్రిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. మూడు ఏళ్ల పాటు టాలీవుడ్ ను ఏలింది. ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీపై ఇపుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

 

రకుల్ ప్రీత్ సింగ్ ను టాలీవుడ్, కోలీవుడ్ లో పట్టించుకోవడం లేదు. బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి అరకొర ఛాన్స్ లే వస్తున్నాయి. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. కెరీర్ ఆరంభంలో చాలా ఆఫర్లు చేజారి పోయాయని.. తాను చేయాల్సిన సినిమాలు ఇతర హీరోయిన్స్ చేశారంటోంది. అయితే తన వరకు వచ్చిన వెళ్లిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయని చెప్పింది. 

 

సౌత్ లో హీరోయిన్స్ పారితోషికం విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ డిఫరెంట్ గా మెచ్యూర్డ్ ఆన్సర్ ఇచ్చింది. సౌత్ లో హీరోల కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే విషయం తెలుసని రకుల్ చెప్పుకొచ్చింది. అందుకో సౌత్ లో హీరోలకు భారీ పారితోషికాలు ఉంటాయనీ.. ఈ లాజిక్ తెలుసు కనుకే ఎప్పుడు పారితోషికాల విషయాల్లో బెట్టు చేయలేదని రకుల్ క్లారిటీ ఇచ్చింది. సౌత్ లో హీరోలకు సమానంగా హీరోయిన్స్ కు రెమ్యునరేషన్ ఇవ్వాలని తాను డిమాండ్ చేయనని చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: