దేశంలోని అన్ని చిత్ర సీమలకి కలిపి ‘బాహుబలి’తో చెరిపివేయలేని రికార్డ్స్ క్రియేట్ చేసిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఈయన ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ అనే మెగా మల్టీ స్టారర్ ఫిలింని తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2021 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 08న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ఆర్ఆర్ఆర్ టీం అనౌన్స్ చేశారు.

 

 

అయితే ఇప్పుడు ఈ అనౌన్స్ మెంట్ తో ఆ సీజన్ కి విడుదల చేద్దామనుకున్న అందరూ తమ సినిమా రిలీజ్ డేట్స్ ని ముందుకు, వెనక్కి జరుపుకున్నారు. కానీ, ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస హిట్ లు  అందుకుంటున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం "ఆర్ఆర్ఆర్" సినిమాకి కి పోటీగానే తన దిరెచ్తిఒన్ చేయబోతున్న సినిమా ‘ఎఫ్ 3’ ని రిలీజ్ చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. దాని ప్రకారమే సినిమా షెడ్యూల్ ని తయారు చేసి పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

 

 

అయితే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ మొదలైన ‘ఎఫ్ 3’ సినిమాని జూన్ నెల నుంచి సెట్స్ పైకి తీసుకుపోవాలని ప్లాన్ చేస్తున్నారు . గత రెండు సంవత్సరాల నుంచి సంక్రాంతి సీజన్స్ లో ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అయితే ఈ సారి కూడా వచ్చే సంక్రాంతి సీజన్ ని కూడా మిస్ కాకుండా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవాలని ఆయన చూస్తున్నారు. "ఎఫ్ 2" లో కనిపించిన హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు మరో హీరోని "ఎఫ్ 3" లో ఉంటారని సమాచారం. అయితే అతను ఎవరనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.

 

 

అయితే మరి ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పెద్ద సినిమా వస్తున్న టైంలో అనిల్ రావిపూడి తన "ఎఫ్ - 3 "తో ఎంత పక్కాగా పోటీకి వచ్చి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా వేచి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: