టాలీవుడ్ లోకి ఎంతో మంది హీరోలు వారసులుగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అతి కొద్ది మంది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  కానీ పెద్దగా సక్సెస్ కాలేక పోయారు.  మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ తరహాలో స్వయంకృషితో పైకి వచ్చిన హీరోల్లో శ్రీకాంత్, రవితేజ, నాని, శర్వానంద్ తర్వాత రాజ్ తరుణ్ ఒకరు.  షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న రాజ్ తరుణ్.. తెలుగు లో ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించింది.  దాంతో షార్ట్ ఫిలిమ్స్ వదిలి సినిమాలకే పరిమితం అయ్యాడు.  రాజ్ తరుణ్ కథానాయకుడిగా దర్శకుడు కొండా విజయ్ కుమార్ 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాను రూపొందిస్తున్నాడు. 

 


రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ తర్వాత ఆ తరహా లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లాంటి వారు హీరోలుగా ఎంట్రటైన్ చేశారు.  పూర్తి వినోదభరితంగా సాగే ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నాడు.  ఈ సినిమాలో ఒక కథానాయికగా మాళవిక నాయర్ మరో కథానాయికగా హెబ్బా పటేల్ నటిస్తున్నారు.  అయితే గత కొంత కాలంగా రాజ్ తరుణ్ నటిస్తున్న సినిమాలకు బ్యాడ్ టాక్ నడుస్తుంది. చివరిగా దిల్ రాజు నిర్మించిన ‘లవర్’ మూవీ కూడా ఫ్లాప్ టాక్ రావడంతో మరోసారి కామెడీకే ప్రాధాన్య ఇస్తున్నాడు రాజ్ తరుణ్. 

 


ఈ మద్య కామెడీ తరహా సినిమాలకు కూడా తెలుగులో మంచి ఆదరణ లభిస్తుంది.  కంటెంట్ బాగుండి కామెడీ బాగా వర్క్ ఔట్ అయితే.. చిన్న సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటున్నాయి.  ఇక ఒరెయ్ బుజ్జిగా మూవీలో  ఒక కీలకమైన పాత్రలో సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ నటిస్తుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో సీనియర్ నరేశ్ .. పోసాని కనిపించనున్నారు. కొంతకాలంగా వరుస పరాజయాలను చవిచూస్తున్న రాజ్ తరుణ్ కి, ఈ సినిమా అయినా హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: