టాలీవుడ్ లో స్టార్ హీరోల వారసులు హీరోలుగా వస్తున్న తరుణంలో స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు తనయుడు వెంకటేష్ ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలాంటి పాత్రల్లో నటించి విక్టరీ వెంకటేష్ గా పేరు తెచ్చుకున్నారు.  ఆయన సోదరుడు డి సురేష్ బాబు స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు.  డి సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా ‘లీడర్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు దగ్గుబాటి రానా. హీరోగానే కాకుండా ఎలింటి క్యారెక్టర్ అయినా తనదైన స్టైల్లో నటించి మెప్పిస్తున్నారు.  బాహుబలి, బాహుబలి 2 లాంటి మూవీలో విలన్ గా నటించి మెప్పించారు.  తాజాగా దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్న సినిమా ‘అరణ్య’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ‘హాథీ మేరే సాథీ’గా హిందీలో తెరకెక్కుతుంది. 


ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.  ఈ వేసవిలో మూడు భాషల్లో ఒకేసారి రిలీజవుతోంది. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తున్నారు. ఇందులో జోయా హుస్సేన్, శ్రియా ల్గావ్ కర్, పులకిత్ సామ్రాట్ ఇతర పాత్రధారులు. తాజాగా 'హాథీ మేరే సాథీ' పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రానా గెటప్ విలక్షణంగా కనిపిస్తోంది. ఇక రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో రానా కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్నాడు. 

 

అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకోని వాటితో సావాసం చేసే అడవి తెగకి చెందిన వ్యక్తిగా ఆయన లుక్ ఉంది. అరణ్య మూవీ మానవుల స్వార్థం కోసం అడవులను ఆక్రమించడం, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వలన ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథగా అరణ్య తెరకెక్కింది.  ఈ మూవీ ఎరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్ ,  శ్రియా పిలగోన్కర్ ఇతర ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: