నాగచైతన్య, తాత నాగేశ్వరరావుగా మారబోతున్నాడు. చైతూ నాగేశ్వరరావుగా నటించబోతున్నట్టు అ్కకినేని కాంపౌండ్ టాక్. ఎలాంటి హడావిడి లేకుండా అక్కినేని కాంపౌండ్ నాగచైతన్యతో అక్కినేని బయోపిక్ కు ప్లాన్ చేస్తోందా.. సైలెంట్ గా చైతూ నాగేశ్వరరావుగా నటించడమేంటనే ప్రశ్నలు.. అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

 

బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో నాగచైతన్య ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుసగా కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చకచకా సాగుతోంది. ఈ క్రమంలోనే చైతూ ఇప్పుడు నాగేశ్వరరావు సినిమాకు కమిట్ అయినట్టు తెలుస్తోంది. 

 

మనం చిత్రంలో నాగార్జున పాత్రలో కనిపించిన చైతన్య మహానటి చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించాడు. త్వరలో చైతూ మరోసారి నాగేశ్వరరావు పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. నాగేశ్వరరావు టైటిల్ తో రూపొందబోతున్న కొత్త చిత్రంలో నాగచైతన్య కనిపించబోతున్నట్టుగా అక్కినేని కాంపౌండ్ లో వినిపిస్తోంది.

 

లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య బంగార్రాజు సీక్వెల్ లో నటించబోతున్నాడు. ఆ తర్వాత దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయబోతున్నట్టు తెలుస్తోంది. గీత గోవిందంతో సెన్సేషన్ హిట్ కొట్టిన పరశురామ్, నాగచైతన్య కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టు వినికిడి. 14 రీల్స్ బ్యానర్ లో తెరకెక్కుతుతున్న ఈ చిత్రానికి నాగేశ్వరరావు అనే టైటిల్ ను ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట. చైతూకి ఈ టైటిల్ బాగా యాప్ట్ అవుతోందని అంటున్నారు. 

 

మొత్తానికి నాగచైతన్య తన తాత అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయన హావ భావాలతో అచ్చం అలానే.. ఆయన పాత్రలో ఒదిగిపోనున్నారట. ఏఎన్ ఆర్ జీవిత చరిత్ర తెరకెక్కుతోందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించి ఒక్క వార్త కూడా బయటికి రాకపోయినా.. అంతా చాపకింద నీరులా జరిగిపోతుందనే గాసిప్స్ గుప్పుమంటున్నాయి. నాగేశ్వరరావు జీవిత చరిత్ర.. అంటే ఆయన బాల్యం.. విద్యాభ్యాసం, సినీ ఇండస్ట్రీకి ప్రవేశం లాంటి అంశాల్లో ముఖ్యమైన ఘట్టాలను దృష్టిలో పెట్టుకొని సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: