‘అర్జున్ రెడ్డి’ సినిమా తో అదిరిపోయే విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయ్యాడు. ఆ తరువాత ‘గీతా గోవిందం’ సినిమా పరశురామ్ దర్శకత్వంలో నటించి అతి చిన్న బడ్జెట్ లోనే భారీ లాభాలు సాధించాడు. దీంతో విజయ్ దేవరకొండ పేరు సౌత్ ఇండస్ట్రీ వ్యాప్తంగా మారుమ్రోగింది. అయితే ఆ తర్వాత నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో విజయ్ దేవరకొండ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. నోట మరియు ఇంకొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.

 

ఇటువంటి నేపథ్యంలో నలుగురు హీరోయిన్లతో క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకకు హైదరాబాద్ నగరంలో అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ సినిమా అన్ని పలు సందర్భాల్లో తెలపడం జరిగింది.

 

దీంతో సినిమాలో నలుగురిలో ఒక హీరోయిన్ గా నటించిన రాశి కన్నా విజయ్ దేవరకొండ వేసిన డైలాగులకు స్పందించింది. ఆమె ఏమంది అంటే విజయ్ దేవరకొండ నీకు అమ్మాయిలను ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉంది...నువ్వు ఇలాంటి ఆలోచనలు తీసుకోవటం మంచిది కాదు అని తెలిపింది. లవ్ స్టోరీ సినిమాలు ఆపేయాలని నువ్వు అనుకోవటం పిచ్చితనం అవుతుంది అన్నట్టుగా రాసి కన్నా కౌంటర్లు వేసింది. దీంతో నెటిజన్లు అవును విజయ ఆమె చెప్పింది నిజం నువ్వు లవ్ స్టోరీ సినిమా చేస్తే కచ్చితంగా మీ కెరీర్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది అంటూ రాశి ఖన్నా చేసిన కామెంట్లకు సపోర్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14వ తారీఖున ప్రేమికుల రోజు నాడు ఈ సినిమా విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: