కొంతమంది స్టార్డమ్ లెక్కల్లోకి వెళ్తే.. మరికొంత మంది కంఫర్ట్ లెవల్స్ చూసుకుంటారు. క్రేజ్, మార్కెట్ అనే వాటితో సంబంధం లేకుండా.. కేవలం పరిచయాలతోనే ముందుకెళ్లే వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. బాలకృష్ణ ఈ రేర్ రూట్ లోనే వెళ్తున్నాడు. హీరోయిన్ల మేటర్ లో పరిచయాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు బాలకృష్ణ. 

 

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సింహా, లెజెండ్ సినిమా తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. మరో మాస్ హిట్ కొట్టబోతున్నారని బాలకృష్ణ అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇలా పాజిటివ్ బజ్ తో మొదలైన ఈ సినిమాకు ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటున్నాడు బాలకృష్ణ.

 

బాలకృష్ణ-బోయపాటి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట. ఈ సినిమాలో నయనతార, శ్రియ ఇద్దరూ జోడీ కడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా సినిమాల్లో కలిసి నటించిన నయన్ తో నాలుగోసారి బాలయ్య స్టెప్పులేయబోతున్నాడట. 

 

బాలకృష్ణ-శ్రియ కాంబినేషన్ లో కూడా మూడు సినిమాలు వచ్చాయి. చెన్నకేశవరెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాల్లో జోడీ కట్టారు. ఇప్పుడు బోయపాటి సినిమాతో నాలుగోసారి కలుస్తున్నారు. అయితే ఈ హీరోయిన్స్ ను రిపీట్ చేసేందుకు వాళ్లతో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణమంటున్నారు యూనిట్ మెంబర్స్.

 

మొత్తానికి బాలయ్య హీరోయిన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన సినిమాల్లో ఆల్ రెడీ నటించిన హీరోయిన్లను మళ్లీ సెలక్ట్ చేసుకుంటున్నాడు. లక్కీ హీరోయిన్ గా ముద్రపడిన వాళ్లను రిపీట్ చేసేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. తనకు కంఫర్ట్ గా ఉండే వాళ్లను మళ్లీ తనతో ఆడిపాడేందుకు సిద్ధం చేసుకుంటున్నాడు. బాలయ్య హీరోయిన్ల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు. చూడాలి మరి నందమూరి నటసింహం బాలకృష్ణ రిపీట్ మంత్రం ఏమాత్రం పనిచేస్తోందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: