ఇక
తమిళ్ వర్షన్
96 మాదిరిగా జాను సినిమాలో కూడా
సమంత, శర్వా తమ ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ లతో ప్రేక్షకులను ఎంతో కట్టిపడేసారు. హృద్యమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ
సినిమా కథ, కథనాలు ఆకట్టుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఉందని కొద్దిపాటి విమర్శలు వచ్చాయి. కాగా అది పెద్ద పట్టింపు కాదని, క్లైమాక్స్ సీన్స్ తో పాటు ముఖ్యమైన కొన్ని సీన్స్ సినిమాకు ప్రధాన బలం అని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు కొందరు
సినిమా నటులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.