టాలీవుడ్ సినిమా పరిశ్రమలో టామ్ అండ్ జెర్రీ గా పేరుగాంచిన నటులు ఎవరయ్యా అంటే ముందుగా ఎక్కువమందికి గుర్తుకు వచ్చే పేర్లు మెగాస్టార్ చిరంజీవి, నటప్రపూర్ణ మోహన్ బాబు. మొదటి నుండి మంచి మిత్రులైన ఈ ఇద్దరూ కూడా ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. చిరంజీవి హీరోగా నటించిన కొన్ని సినిమాల్లో విలన్ గా నటించిన మోహన్ బాబు, మెగాస్టార్ కు ఢీ అంటే ఢీ అన్నట్లుగా తన పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్నారు. ఇక వీరిద్దరి మధ్య కొద్దిపాటి వివాదాలు ఉన్నాయని, ఒకరంటే ఒకరికి పడదని ఎప్పటినుండో పలు వార్తలు ప్రచారం అవుతున్నప్పటికీ, అటువంటివి ఏవి కూడా మా ఇద్దరి మధ్యన లేవని, 

 

ఎప్పటికప్పుడు ఒకరిపై మరొక ప్రేమాభిమానాలు కురిపిస్తూ వీరిద్దరూ కలిసిన సందర్భాలు ఇటీవల చాలా ఉన్నాయి. ఇకపోతే కొద్దిరోజలుగా వీరిద్దరి విషయమై ఒక వార్త ప్రచారం అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారని వార్తలు రావడం జరిగింది. ఇక రెండు రోజుల క్రితం మోహన్ బాబువి రెండు తాజా ఫోటోలు ఇంటర్నెట్ లో రిలీజ్ అయ్యాయి. ఆ ఫొటోల్లో మోహన్ బాబు కొంత రఫ్ లుక్ లో దర్శనం ఇచ్చారు. 

 

అయితే మోహన్ బాబు ఆ తాజా లుక్ మెగాస్టార్, కొరటాల మూవీ లోనిదే అని, ఆ సినిమాలో ఆయన ఒక ముఖ్యమైన నెగటివ్ పాత్రలో నటిస్తున్నారని, కాగా మెగాస్టార్ కు మోహన్ బాబుకు మధ్య జరిగే ఒక ఫైట్ సీన్ ని ఇటీవల దర్శకుడు కొరటాల చిత్రీకరించాడని అంటున్నారు. అయితే దీనిపై ఎక్కడా కూడా అధికారిక ప్రకటన లేకపోవడంతో చాలా మంది ఈ వార్తను కొట్టిపారేస్తున్నారు. మరి దీనిపై కొరటాల అండ్ కో ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: