బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య చేయబోయే క్యారెక్టర్స్ పై క్లారిటీ వచ్చేసింది. ముందు నుండి అనుకుంటున్నట్టుగానే నందమూరి స్టార్ ఈ సినిమాల ఊహించని పాత్రలో షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

 

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తర్వాత బాలకృష్ణ సక్సెస్ కోసం మరోసారి బోయపాటి శ్రీనునే నమ్ముకున్నాడు. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా కాస్త ఆలస్యమైంది. స్క్రిప్ట్ పూర్తైన తర్వాతే సెట్స్ పైకి వెళ్దామని బాలయ్య ఆర్డర్ వేయడంతో గత నెలరోజులుగా బోయపాటి శ్రీను స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమైపోయాడు. ఎట్టకేలకు కథ పూర్తవడంతో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రాలు సింహా, లెజెండ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీంతో ఇప్పుడు చేయబోయే సినిమా మరింత పవర్ ఫుల్ గా ఉండాలని బాలకృష్ణ, బోయపాటి శ్రీను భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య పాత్రను దర్శకుడు బోయపాటి ఊహించని రేంజ్ లో మలిచినట్టు తెలుస్తోంది. కథ డిమాండ్ ప్రకారం బాలయ్య ఇందులో అఘోరాగా కనిపించబోతున్నట్టు టాక్.

 

స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతోనే బాలయ్య అఘోరాగా కనిపించేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అఘోరాగా బాలయ్య పాత్ర మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు. బాలకృష్ణ లాంటి ఊరమాస్ స్టార్ అఘోరా పాత్రలో నటించబోతుండటం ఓ విధంగా ఓ ఛాలెంజ్ అనే చెప్పాలి. వారణాసిలో ఈ నెల 26 నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. మొత్తానికి నందమూరి నటసింహం ఎవరూ ఊహించని గెటప్ తో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేసే బాలయ్య న్యూ రోల్ ఎంచుకున్నాడు. మరి ఆ పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: