తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ దర్శకుడికి ఉన్న కాలిక్యులేషన్స్ ఏ దర్శకుడి ఉండవు... ప్రతి సీన్లో ఈ దర్శకుడి కాలిక్యులేషన్ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి... కథను ఎటు నుంచి ఎక్కడికి ప్రేక్షకుడికి  మొదటినుంచి అర్థం కాదు కానీ చివరికి ట్విస్ట్ ఏంటో రివీల్ ప్రేక్షకుడికి సర్ప్రైస్ చేస్తూ ఉంటాడు. తనదైన  కాలిక్యులేషన్స్ తో ఒక్కొక్కసారి అభిమానులను కన్ఫ్యూజ్ చేయగలడు... ఒక్కొక్కసారి తనదైన శైలిలో క్లారిటీ ఇవ్వగలరు. జగడం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సుకుమార్.. ఆ తర్వాత 100% లవ్ లో మరో విజయాన్ని అందుకుంది.. ఇక ఆ తర్వాత ఆర్య ఆర్య 2 చేసి... అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఇక నాన్నకు ప్రేమతో సినిమా లో.. నాన్న మీద ఒక యువకుడికి ఉండే ప్రేమను చూపిస్తూనే... నాన్న లక్ష్యాన్ని తీర్చిన  కొడుకును  కూడా చూపించాడు. 

 


 కొన్ని కొన్ని సార్లు సుకుమార్ సృష్టించిన కాలిక్యులేషన్స్ కేవలం ఆదర్శకుడికి  మాత్రమే అర్ధమవుతాయి... కొన్నిసార్లు ప్రేక్షకులు కూడా సుకుమార్ ప్రతి సీన్ లో చూపించే కాలిక్యులేషన్స్ తో ఔరా అనాల్సిందే. ఇప్పటికే ఎన్నో సినిమాలు తీసి అద్భుత విజయాలను అందుకున్నారు సుకుమార్. రంగస్థలం సినిమా తో అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో... అద్భుతమైన కళా ఖండం అనే చెప్పాలి. 1985 నాటి కథాంశాన్ని.. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించి.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మేలిమి బంగారం లాంటి సినిమాను రూపొందించాడు అని చెప్పాలి. 

 


 రంగస్థలం రామ్ చరణ్ కెరియర్ లోనే ఇది బెస్ట్ విజయాన్ని అందించారు సుకుమార్... ఎప్పుడు తనదైన క్యూట్ స్మైల్ తో ప్రేక్షకులను అలరించిన సమంతను పల్లెటూరి అమ్మాయి గా చూపించు.. ప్రేక్షకులందరికీ సరికొత్త సమంతను పరిచయం చేశారు. అయితే సుకుమార్సినిమా తీసిన ఆ సినిమాలో తనదైన కాలిక్యులేషన్స్ ఉంటాయి. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో సుకుమార్ ను కాలిక్యులేటడ్  దర్శకుడిగా పిలుస్తూ ఉంటారు. సుకుమార్ ఏ సీన్ తెరకెక్కించిన అందులో ఏదైన కాలిక్యులేషన్స్ నింపేసి తెరకెక్కిస్తున్నారు. నాన్నకు ప్రేమతో సినిమా లో ఒక సీతాకోకచిలుక ఎగరడం వల్ల వచ్చిన గాలితో సునామి వస్తుందని కాలిక్యులేట్ చేయాలి అన్న... రంగస్థలం సినిమాలో .. మొదట పామును చంపేందుకు  వచ్చిన హీరో చివరిలో విలన్ను పామును చంపేలా  కాలిక్యులేట్ చేయాలి అన్న అది కేవలం సుకుమార్ కే సాధ్యం అని చెప్పారు. సుకుమార్ కు ఉన్నన్ని  కాలిక్యులేషన్స్ మరో దర్శకుడికి ఉండవు అనిపిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: