టాలీవుడ్ లో ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం స్టైల్ మాత్రం ఎంతో వేరు. ముఖ్యంగా ఆయన సినిమా కోసం రాసుకున్న స్రిప్టు అందరి దర్శకుల కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. సినిమా మొత్తం పంచు డైలాగ్ లతో నింపేసి... అదిరిపోయే ప్రాసతో ఆకట్టుకునే యాసతో ప్రేక్షకులందరికీ ఎక్కడా బోర్ కొట్టకుండా అలరించగలడు  త్రివిక్రమ్. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కాస్త మాటల మాంత్రికుడు అని పిలుచుకుంటారు అభిమానులు . మాటలతో మాయ చేస్తూ.. పంచ్ డైలాగులతో ప్రేక్షకులను మెప్పించే సత్తా త్రివిక్రమ్ సొంతం. త్రివిక్రమ్ సినిమాలో అడుగడుగునా పంచ్ డైలాగులు... ఇక ఆ పంచు డైలాగ్ లలో ప్రాస  వింటున్న  ప్రేక్షకులందరికీ... అబ్బబ్బబ్బా... ఏం ఉంది  డైలాగ్... అనుకుంటూ ఉంటారు. 

 


 సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తనదైన స్టైల్ పంచ్ డైలాగులతో దూసుకుపోతున్నాడు త్రివిక్రమ్. కేవలం పంచ్ డైలాగులే  కాదు దానికి ఒక ప్రాస యాస  కూడా ఉంటుంది. ఇలాంటి డైలాగులు మరే  దర్శకుడి సినిమాలో కనిపించవు అనడంలో సందేహం లేదు. యుద్ధానికి ఎవ్వడైనా కాలు దిగుతాడు.. కానీ తనదైన రోజు యుద్ధం రాకుండా ఆపుతాడే వాడు గొప్ప వాడే గొప్ప... కంట పడ్డావా కనికరిస్తానేమో... వెంట పడ్డానా నరికేస్తా ఓభా... యుద్ధం చేసే సత్తా లేని వాడికి శాంతి అడిగే హక్కు లేదు.. ఇలాంటి ప్రాసతో కూడిన అద్భుతమైన డైలాగులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం నుంచి జాలువారినవే. ఇలాంటి అద్భుతమైన డైలాగులతో... హీరోయిజానికి అసలుసిసలైన రూపం తెస్తాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. 

 

 

 పాలిచ్చి పెంచిన తల్లులు సార్... పాలించడం ఒక లెక్క వీళ్ళకి... అని డైలాగులతో అందరినీ మెస్మరైజ్ చేయాలన్న... ఈ భూమ్మీద దేన్నైనా పుట్టించే సత్తా ఇద్దరికీ ఉంటుంది సార్ ఒకటి నెలకి ఇంకోటి వాళ్లకి... అంటూ ఎన్నో అద్భుతమైన డైలాగులు పలికించాలన్నా అది ఒక త్రివిక్రముడు కే సాధ్యం. సినిమా  చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మాటలతో మాయ చేయగల సత్తా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కే సొంతం. సినిమా ఎలా ఉన్నావ్ కథ ఎలా ఉన్న... తనదైన పంచ్ డైలాగులతో సినిమా చూస్తున్న ప్రేక్షకులందరికీ ఎక్కడా బోర్ కొట్టకుండా... యాసతో ప్రాసతో కూడిన పంచు డైలాగ్ లతోనే ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందించగలరు త్రివిక్రమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: