సమంత క్రేజ్ చూస్తుంటే మిగతా హీరోయిన్స్ కుళ్ళుకొని చావాల్సిందే. అలాంటి సినిమాలు చేస్తూ అంతకంతకి తన స్టార్ డం ని పెంచుకుంటూ పోతోంది. గత సంవత్సరం మజిలీ, ఓ బేబీ సినిమాలతో హిట్స్ అందుకున్న సమంత రీసెంట్‌గా జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ ని అందుకుంది. అయితే నిన్నా మొన్నటి వరకు సమంత డైరీ ఖాలీ అని అనుకున్నారు అందరు. అంతలో చిన్న షాకిచ్చింది ఈ అక్కినేని కోడలు. మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో  ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. మ్యాట్నీ మూవీస్ తో కలిసి మెగాస్టార్ తనయుడు రాం చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అంతేకాకుండా చరణ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

 

ఇక ఇదే సినిమాలో సమంత కూడా నటించే అవకాశాలు ఉన్నాయంటూ తాజాగా వార్తలు వస్తున్నాయి. కాని సమంత నటించేది చిరంజీవికి జోడీగా కాదు.. రామ్ చరణ్ కు జోడీగా అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రంగస్థలం సినిమాతో వీరిద్దరి జోడీకి మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే మరోసారి వీరిద్దరిని కలిపి చూపించడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు.. సినిమాకు మంచి బిజినెస్ అవుతుందనే ఉద్దేశ్యంతో కొరటాల శివ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.

 

మెగా 152లో చరణ్ కనిపించేది కేవలం అర్థ గంట పాత్ర అని చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం. ఆ సమయంలోనే ఒక ఫైట్ తో పాటు ఒక పాట కూడా ఉంటుందట. ఇక ఈ సినిమాలో సమంత స్క్రీన్ ప్రజెన్స్ పది నుండి పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటుందని.. అందుకు ఆమె ఒప్పుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

 

కానీ సమంత రాజుగారి గది లో కూడా తక్కువ సమయమే కనిపించి మెప్పించింది. అంతేకాదు పాత్ర ప్రభావితం చేస్తుందంటే ఒప్పుకోవడానికి వెనకాడదని టాక్. 
ఒకవేళ సమంత గనక ఒప్పుకోకపోతే మరో ఇద్దరిని సంప్రదించి ఎవరినో ఒకరిని ఫైనల్ చేస్తారని అంటున్నారు. అయితే ఆ ఇద్దరు ఎవరన్నది ఇంకా క్లారిటి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: