దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే అయన ఇప్పుడు తెలుగు డైరెక్టర్ కాదు ఇంటర్నేషనల్ డైరెక్టర్. రాజమౌళి సినిమాల కోసం ఇప్పుడు కేవలం తెలుగు ప్రజలు మాత్రమే కాదు ఇంటెర్నేషల్ ప్రేక్షకులు కూడా అయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. 

 

కారణం అయన తీసే సినిమాలు.. అవును.. అయన తీసే సినిమాలు ప్రపంచ ప్రజలకు ఇష్టం.. ఎందుకంటే.. సినిమా అంత అద్భుతంగా ఉంటుంది. అయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది అంటే ఆయన సినిమా రిలీజ్ కు ముందు ఎంత కష్టపడుతారో ఒకసారి మీరు ఆలోచించండి.. 

 

ఒక్క అయన సినిమాలు అద్భుతం అని చెప్పాలి.. అవును.. ఏ దర్శకుడికి అయినా.. మొదటి సినిమాకు సమయం ఎక్కువ పడుతుంది.. ఎక్సపీరియన్స్ పెరిగేకొద్దీ సమయం తక్కువ అవుతూ వస్తుంది.. కానీ మన దర్శకేంద్రుడికి మాత్రం అలా కాదు.. మొదటి సినిమా చాలా స్పీడ్ గా తీశాడు.. అలా తీసేకొద్దీ ఆయనకు ఆలస్యం అయిపోతుంది అంటే నమ్మరు.. 

 

అయన 2001లో స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.. అప్పటి నుండి ఇప్పటి వరుకు కేవలం 12 అంటే 12 చిత్రాలు తీశాడు.. కానీ తీసిన ప్రతి సినిమా ఆలస్యం అయినప్పటికీ సూపర్ హిట్ అవుతుంది అంటే నమ్మండి.. సింహాద్రి, సై , ఛత్రపతి , విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, బాహుబలి 2.. ఇలా అన్ని సినిమాలు సూపర్ హిట్టే. 

 

ప్రతి సినిమాకు సమయం తీసుకోని.. పరిశోధన చేసి.. ఒకటికి రెండు సార్లు సినిమా సీన్లు రిపీట్ చేసి చూసి చూసి.. ఎక్కడ మార్క్ అనేది లేకుండా.. మచ్చ అనేది లేకుండా ప్రేక్షకులకు సినిమాను అందిస్తాడు జక్కన్న. అంతటి సమర్ధుడు రాజమౌళి. రాజమౌళి సినిమా కోసం ప్రస్తుతం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది.. ఇక ఇప్పుడు ఎంతో క్రేజీగా గత 2 సంవత్సరాల నుండి మల్టిస్టారర్ గా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. 

మరింత సమాచారం తెలుసుకోండి: