తెలుగు బుల్లి తెరపై జబర్దస్త్ షో ఓ సంచలనం. ఈ విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 2013 ఫిబ్రవరిలో మొదలైన ఈ కామెడీ షో సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. మరే షోకు లేనంతగా టీఆర్ఎస్ సాధిస్తూ టాప్ ప్లేస్‌లో దూసుకెళ్తోంది. జబర్దస్త్ షో తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది కమెడియన్లను పరిచయం చేసింది. మరెంతో మంది యువ నటులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. లేడీ గెటప్‌లు వేసే యువకులతో పాటు బాల నటులనూ ఎంకరేజ్ చేసింది. అలాగే నటించడం, నవ్వించడం అంత సులువైన ప‌ని కాదు.

 

అయినా పిల్లల చేత ఈ రెండూ చేయించడం సాహసంతో కూడుకున్న పని. కానీ ఏకంగా ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని వారానికి ఓ స్కిట్ అవలీలగా చేసేస్తున్నాడు జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్. దాదాపు ఏడేళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తున్న జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్ చేస్తున్నవారంతా యువకులు, పెద్దవాళ్లే. కానీ రాకింగ్ రాకేష్ టీం మాత్రం అందరికంటే భిన్నం. ఎందుకంటే ఈయ‌న స్కిట్‌లో ఈయ‌న, పిల్ల‌లు త‌ప్ప ఎవ‌రు ఉండ‌రు. రాకేష్ టీంలో నేహాంత్, యోధ, దీవనలది కీలక పాత్ర. నిహాంత్ తన మాటలు, హావభాబాలతో నవ్విస్తాడు. 

 

యోధ పంచ్‌లతో సందడి చేస్తే.. ఇక దీవెన ఏకంగా యాంకర్ రష్మీపైనే సెటైర్లు వేస్తుంది. ఇలా కేవ‌లం చిన్న పిల్లలతోనే స్కిట్ నడిపి నవ్వులు పూయిస్తున్నాడు రాకేష్. జబర్దస్త్ స్టేజిపై దీవెన, యోధ, నిహాంత్ చేసే అల్లరికి జడ్జిలు రోజా, నాగబాబుతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఇక వాస్త‌వానికి రాకేష్‌ను జబర్దస్త్‌కు పరిచయం చేసింది ధన్‌రాజ్. అయితే ధన్‌రాజ్ జబర్దస్త్ మానేస్తున్నప్పుడు రాకేష్‌కు టీం లీడర్‌గా అవకాశం ఇచ్చారు. అప్పటికి జబర్దస్త్ మొత్తంలో రాకేష్‌నే చిన్నవాడు. 

 

అలాగే పోటీ కూడా ఎక్కువ. ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవడానికి, పంచ్‌లు వేయడానికి, ఫ్యామిలీ డ్రామాలు చేయడానికి అందరూ ఉన్నారు. మ‌రి వారిని దాటుకుని వెళ్ల‌డానికి రాకేష్‌కు చాలా భ‌య‌మేసింద‌ట‌. ఈ క్ర‌మంలోనే మొదట్లో ఏ కాన్సెప్ట్‌తో స్కిట్ చేయాలో తెలీక చాలా ఇబ్బందిపడ్డాడ‌ట‌. అప్ప‌టికి ఇంకా రాకేష్‌కు గుర్తింపు కూడా రాలేద‌ట‌. దాంతో షో వదిలేసి వెళ్లిపోవాలనుకున్నాడ‌ట‌. కానీ కాస్త కొత్తగా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు పిల్లలతో స్కిట్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించ‌డంతో అదే ఐడియాను ఫాలో అయిపోయి ప్ర‌స్తుతం టాప్ టీం లీడ‌ర్స్‌లో ఒక‌డిగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: