పవన్ కళ్యాణ్.. మొన్నటికి మొన్న అన్నయ వల్ల ఏమి కాదు.. నా టాలెంట్ తో నేను పైకి వచ్చా అని సంచలన మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్నయ్యను ఆదర్శంగా తీసుకున్నాడు. అయితే ఏ విషయంలో ఆదర్శంగా తీసుకున్నాడో తెలుసా? సైరా సినిమాలో అన్న స్వాతంత్రయోధుడుగా కనిపించి ప్రేక్షకులను అలరించిన చిరంజీవిని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నాడు. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ కు ప్రస్తుతం సినిమాలు తియ్యాలి అనే మూడ్ వచ్చిన సంగతి తెలిసిందే.. అందుకే అయన రెండు సంవత్సరాల్లో 5 సినిమాలు తియ్యాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పింక్ రీమేక్ లో నటిస్తున్న పవన్ కళ్యాణ్.. నెక్స్ట్ క్రిష్ దర్శకత్వంలో నటించనున్నట్టు తెలిసిందే.. 

 

 

అయితే ఈ నేపథ్యంలోనే క్రిష్ పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది.. అది ఏంటి అంటే.. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ లుక్ మార్చినట్టు.. అందుకే చేతిపై గద్ద టాటూ వేయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

 

అయితే గద్ద టాటూ దాదాపు 200 సంవత్సరాల క్రితం ఉండే బందిపోట్లు ఇలాంటి పచ్చబొట్టే ఉండేది అని.. క్రిష్ దర్శకత్వంలో బందిపోటు పాత్ర కోసమే ఆ టాటూ వేయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించబోయే పాత్ర పాలమూరి పండుగ సాయన్న అనే వీరుడిదట.  

 

అయితే ఈ పండుగ సాయన్న కథ కూడా 1840 నుండి 1985 మధ్యలో ఉందని చరిత్రలో ఉంది.. అయితే ఈ వీరుడు పేరు పెద్దగా తెలియకపోయిన తెలంగాణ ప్రజలు మాత్రం అయన గురించి కథలు కథలుగా చెప్తుంటారట.. మరి ఈ పాత్రలో పవన్ కళ్యాణ్ ఏమాత్రం నటిస్తాడో చూడాలి... అయితే మెగా ఫ్యామిలీ అంత ప్రస్తుతం స్వతంత్ర సమరయోధులు అయిపోయారు.. చిరంజీవి సైరా నరసింహ రెడ్డి.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు.. పవన్ కళ్యాణ్ సాయన్న పాత్ర. 

మరింత సమాచారం తెలుసుకోండి: