ఎస్.ఎస్. రాజమౌళి.. దర్శకధీరుడు రాజమౌళి.. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఎందుకంటే అయన ఇప్పుడు తెలుగు డైరెక్టర్ కాదు ఇంటర్నేషనల్ డైరెక్టర్. రాజమౌళి సినిమాల కోసం ఇప్పుడు కేవలం తెలుగు ప్రజలు మాత్రమే కాదు ఇంటెర్నేషల్ ప్రేక్షకులు కూడా అయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. 

 

సినీ రచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు రాజమౌళి.. బుల్లితెరపై సీరియల్స్ చేసిన రాజమౌళి రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీ జీవితాన్ని ప్రారంభించాడు.. అలాంటి రాజమౌళి.. తీసిన ప్రతి చిత్రం సూపర్ హిట్ అవుతుంది. కారణం ఏంటో మీకు తెలుసా? 

 

రాజమౌళి మొదటి సినిమా నుండి ఇప్పటి వరుకు ఒక్కటి కూడా ప్లాప్ అవ్వలేదు.. నిజానికి అయన తీసిన మొదటి సినిమా కూడా ప్లాప్ అవ్వలేదు.. అసలు ఏ దర్శకుడికి అయినా ఒక సినిమా అయినా ప్లాప్ ఉంటుంది.. కానీ రాజమౌళికి ఒక్కటి కూడా లేదు.. అంతేకాదు అయన తీసే ప్రతి చిత్రం చాలా టైమ్ తీసుకుంటాడు.. 

 

సినిమా కోసం చాలా సమయాన్ని కేటాయించి.. ఎన్నో పరిశోధనలు చేసి.. సినిమా తీస్తాడు.. జక్కన్న సినిమా తీశాడు అంటే.. అందులో పేరు పెట్టడానికే ఛాన్స్ ఇవ్వడు.. అలాంటి దర్శకుడు రాజమౌళి. అందుకే అయన సినిమా ఒక్కటి కూడా ప్లాప్ అయినది లేదు.. సినిమా అద్భుతంలా మాత్రమే కనిపిస్తుంది.. 

 

కానీ ఆ అద్భుతం వెనుక రాజమౌళి కష్టం ఎవరికీ కనిపించదు.. 2001లో మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1 నుండి మొన్న వచ్చిన బాహుబలి 2 వరుకు అయన సినిమా ఒక్కటి కూడా ప్లాప్ అయినట్టు లేదు.. అయన చేసే ప్రతి చిత్రం అద్భుతం అనే చెప్పాలి.. ఇప్పుడు మరోసారి.. మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రాజమౌళి.. అదే 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి నెలలో విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: