ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందో  తెలిసిన విషయమే. ప్రతివారం కొత్త కొత్త కామెడీ స్కిట్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది జబర్దస్త్. అందుకే ఈ షో కి ఎంతో పాపులారిటీ ఏర్పడింది. అయితే జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి జడ్జిగా మెగా బ్రదర్ నాగబాబు కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఆరెంజ్  సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నాగబాబు భారీగా నష్టాల పాలు కావడంతో అయోమయం లో ఉన్న నాగబాబు కెరీర్ ని మళ్లీ ఊపందుకునేల  చేసింది జబర్దస్త్ షో ని అనడంలో సందేహం లేదు. దీనికి సంబంధించి ఒకానొక సమయంలో నాగబాబు కూడా ఒప్పుకున్నారు. జబర్దస్త్ జడ్జి గా  కొనసాగిన మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయరూ. 

 


 కానీ మొన్నటికి మొన్న జబర్దస్త్ షో నుంచి తప్పుకొని సంచలనం సృష్టించిన ఈ విషయం తెలిసిందే. అయితే తనకు మరోసారి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షో ని  వదలడం మంచిది కాదని పలువురు సలహాలు ఇచ్చినప్పటికీ నాగబాబు మాత్రం జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. తర్వాత జీ తెలుగులో అదిరింది అనే షో కూడా ప్రారంభించారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా... జబర్దస్త్ కి వచ్చిన  రేటింగ్స్ మాత్రం అదిరింది షో కి రావడం లేదు. అంతేకాకుండా రోజురోజుకు అదిరింది షో  కు వస్తున్న రేటింగ్స్ కూడా తగ్గిపోతుంది. అటు జబర్దస్త్ మాత్రం జడ్జిగా నాగబాబు లేకపోయినప్పటికీ ప్రతివారం కొత్త జడ్జీలు వస్తూ అలరిస్తున్నారు. 

 


 అయితే... జబర్దస్త్ కంటే ఎక్కువగా పాపులర్ చేద్దామనుకున్న అదిరింది షో కాస్త ప్రస్తుతం అంతగా వర్కవుట్ కాకపోవడంతో నాగబాబు మళ్ళీ జబర్దస్త్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా గెటప్ శీను లాంటి వాళ్ళు దీన్ని డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసారు కూడా. అయితే నాగబాబు ఎంట్రీ కి మళ్ళీ యాజమాన్యం మాత్రం నో ఎంట్రీ బోర్డ్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. జబర్దస్త్ నుంచి తప్పకుండా నాగబాబు సైలెంట్ గా ఉండకుండా జబర్దస్త్ షో పై ఆరోపణలు విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే నాగబాబును మళ్ళీ జబర్దస్త్ లోకి తీసుకునేందుకు యాజమాన్యం అంతగా ఆసక్తి చూపడం లేనట్లు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. నాగబాబు ను మళ్లీ జబర్దస్త్ షో తీసుకొచ్చే బదులు.. కొత్త జడ్జి లని  తీసుకురావడం బెటర్ మల్లెమాల యజమాని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: