రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం దర్బార్. మొదటి నుంచి ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. అటు తమిళ కన్నడ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా ఈ సినిమాపై ఎంతో అంచనాలు పెంచుకున్నారు. ఇక ఎన్నో ఏళ్ల తర్వాత ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ పాత్రలో  నటిస్తుండడంతో ఈ సినిమాకు హైప్ పెరిగిపోయింది. ఇక సంక్రాంతి పండుగ ముందు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక... ఫ్లాప్ మూవీ గానే మిగిలిపోయింది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రజనీకాంత్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకోగా  సినిమా రజినీకాంత్ సహా అభిమానులని  కూడా నిరాశ పరిచింది. 

 


 అయితే ప్రస్తుతం దర్బార్ సినిమా ఫ్లాప్ కావడంతో దర్బార్ సినిమా హక్కులను కొన్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఎంతగానో నష్టపోయారు. ఈ నేపథ్యంలో తాము నష్టపరిహారాన్ని హీరో రజనీకాంత్ సహా దర్శకుడు మురుగదాస్ లైకా నిర్మాణ సంస్థ నుంచి కూడా రికవరీ చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లు మొన్నటికి మొన్న రజనీకాంత్ను కలిసేందుకు... వెళ్లినప్పటికీ రజినీకాంత్ ను కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు తర్వాత దర్శకుడు మురుగదాస్ ను కలవాలని అనుకోగా దర్శకుడు మురుగదాస్ కూడా పోలీస్ సెక్యూరిటీ కావాలని కోరిన విషయం తెలిసిందే. 

 


 అయితే సంక్రాంతి పండుగ ముందు విడుదల అయినప్పటికీ ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పారితోషికం పై ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. దర్బార్ సినిమా కోసం రజనీకాంత్ 108 కోట్ల పారితోషికం తీసుకున్నారని ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే దర్బార్ సినిమాను తెరకెక్కించిన స్టార్ దర్శకుడు మురుగదాస్సినిమా కోసం ఏకంగా 60 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నయనతార 6 కోట్లు తీసుకున్నారని... నష్టాల గురించి డిస్ట్రిబ్యూటర్లు అందరూ హీరో హీరోయిన్ దర్శకుడిని మాత్రమే అడగాలని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సూచిస్తున్నట్లు ఓ వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: