దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన సినీ కెరీర్ స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో మొదలు పెట్టారు. అప్పటినుంచి బాహుబలి ఫ్రాంచైజీ దాకా ఒక్క ఫ్లాప్ ని చూడలేదు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గానే కాదు యావత్ ప్రపంచం గొప్పగా తన గురించి మాట్లాడుకునే స్థాయిని సంపాదించుకున్నారు. మాట్లాడేవాడెప్పుడు పనిచేయలేడు..పనిచేసేవాడెప్పుడు మాట్లాడడు. ఇది మన జక్కన్నకి పర్ఫెక్ట్ గా సూటవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కో సినిమాతో ఒక్కో బ్లాక్ బస్టర్ ని అందుకుంటూ ఒక్కో సినిమాతో గొప్ప క్రేజ్ ని సంపాదించుకుంటూ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అలుపెరగని బాటసారిగా కొనసాగుతున్నారు. 

 

హీరో ఎవరైనా అతనిమీద రాజమౌళి స్టాంప్ ఉండాల్సిందే. సినిమాకొసం ఎంతగా తపిస్తారో తన హీరోని సినిమాలో హైలెట్ చేయడానికి అంతగా తపిస్తారు. కాంప్రమైజ్ కాని తత్వమే జక్కన్న కి ఇప్పటికే వరుస సక్సస్ లని, ఎనలేని కీర్తిని సంపాదించిపెట్టాయి. కథ రాసేది స్వయాన రాజమౌళి తండ్రిగారైన విజయోంద్ర ప్రసాద్ అయినప్పటికి ఏమాత్రం రాజీపడని తత్వమే కంటిన్యూస్ గా సూపర్ హిట్స్ రాజమౌళి సొంతమయ్యాయి. అయితే రాజమౌళి మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. సినిమాని బాగా చెక్కుతారని అలా చెక్కడానికే సంవత్సరాలు సమయం తీసుకుంటారని ప్రేక్షకులు బాగా నిరిత్సాహపడుతుంటారు.

 

అలా చెక్కబట్టే ఇన్ని బ్లాక్ బస్టర్స్ సాధ్యమైందని జక్కన్న మాట్లాడకుండానే సమాధానమిస్తారు. ఇక బాహుబలి బినింగ్, కన్‌క్లూజన్ లతో తెలుగు చిత్ర పరిశ్రమ కీర్తిని ఆకాశానికి ఎత్తారు రాజమౌళి. ఇంతటి ఘన విజయం ఆయనని ఎవరికి అందనంత ఎత్తులో కూర్చోబెట్టింది. తెలుగు సినిమా పవర్ ఏంటో చూపించిన రాజమౌళి కి అన్ని దేశాలలోను అభిమానులున్నారు. ఇక పాన్ ఇండియా రేంజ్ ఉన్న దర్శకుడిగా కూడా రాజమౌళి గొప్ప పేరును సంపాదించుకున్నారు. దాంతో ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్.ఆర్.ఆర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 

అయితే ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టే పనులన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దాంతో అటు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఇటు రాం చరణ్ ఫ్యాన్స్ తో పాటు యావత్ సినీ ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ రాజమౌళి అందరి ఆశలని చల్లార్చేశారు. అఫీషియల్ గా ఈ సినిమా 2021 సంక్రాంతికి రిలీజ్ అంటు పెద్ద షాకిచారు. అయితే ఇది చాలా చాలా పెద్ద టార్గెట్ తోనే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాని సంక్రాంతికి నెట్టారని చెప్పుకుంటున్నారు. అప్పటికి మెగాస్టార్, పవర్ స్టార్ సినిమాలతో పాటు వెంకటెష్, బాలయ్య సినిమాలు బరిలో ఉండేలా చూస్తున్నారు మేకర్స్. 

 

వీళ్ళతో పాటు కొన్ని కుర్ర హీరోల సినిమాలు రెడీ అవుతాయని సమాచారం. అయితే వాటన్నిటికి చెక్ పెట్టే ఉద్దేశ్యంతోనే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ని సంక్రాంతి బరిలో దింపుతున్నారట. అయితే మెగాస్టార్ - కొరటాల సినిమా తో పాటు పవన్-క్రిష్ ల సినిమాలు ఒకవేళ ఆ సమయానికి సిద్దం కాకపోతే జక్కన్నదే సంక్రాంతి. ఒకరకంగా అదే నమ్మకం కూడా ఉందట. అందుకే అన్ని పక్కాగా ఆలొచించుకొని తారక్, చరణ్ లని కన్విన్స్ చేసి మరీ సంక్రాతికి వద్దామని డిసైడయ్యారట. దాంతో బాహుబలి సినిమాని మించి కలెక్షన్స్ రాబట్టొచ్చన్నది రాజమౌళి మాస్టర్ ప్లాన్ అంటున్నారు. ఇక సమ్మర్ లో వస్తుందనుకున్న కోట్ల జనాలు ఇప్పుడు పిచ్చోళ్ళే.  

మరింత సమాచారం తెలుసుకోండి: