కమిట్‌మెంట్ గురించి చెప్పాలంటే మెగా ఫ్యామిలీ గురించి చెప్పాలి. తమ అభిమానుల కోసం ఎంత కష్టపడతారో మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, అల్లు అర్జున్ .. డాన్స్ విషయంలో ప్రత్యక్షంగా చూసింది తక్కువ. కానీ వీళ్ళు మాత్రం ఫ్యాన్స్ ని అలరించడానికి వెముకలు విరగ్గొట్టుకొని మరీ డాన్స్ ప్రాక్టీస్ చేయడం, ఫైట్స్ విషయంలో రిస్క్ చేయడం చూస్తే ఎవరికైనా చమటలు పట్టి వెన్నులో వణుకొచ్చేయాల్సిందే. అంతగా ఈ మెగా హీరోలు తమ వాళ్ళ కోసం, మెగా ఫ్యాన్స్ కోసం శ్రమిస్తంటారు.

 

60 ఏళ్ళు దాటిన మెగాస్టార్ కూడా మెగా ఫ్యాన్స్ కోసం ఇప్పటికి డాన్స్ విషయంలో తీసుకే శ్రద్ద చూస్తుంటే సినిమా ఇండస్ట్రీలో ఇంకెవరైనా చేయగలా అంటూ ఆశ్చర్యపోవడం ఖాయం. ఒక రకంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీలో ఉన్నంత మంది డాన్సర్స్ సినిమా ఇండస్ట్రీలో ఇంకే ఫ్యామిలీలోను లేరన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ రాళ్ళ మీద నడి తన వాళ్ళ కోసం వేసిన పూల బాట మీద నడుస్తున్న పవర్ స్టార్ తో సహా మెగా హీరోలందరు ఆయనకి సదా జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలనడంలో సందేహం లేదు. 

 

మెగా బ్రదర్స్ గా చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లను చూస్తుంటే ఇండస్ట్రీలోనే కాదు యావత్ ప్రేక్షకులకి ఆ కిక్కే వేరు. ఇక ఈ ముగ్గురు మెగా బ్రదర్స్ ని ఒకే ఫ్రేం లో చుస్తే ఆ క్షణం ఎవరైనా మెస్మరైజ్ అవ్వాల్సిందే. కానీ అలాంటి సందర్భాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అయితే ఈ మెగా బ్రదస్ కి ఉన్న మెగా డాటర్ కొణిదెల నిహారికా మెగా బ్రదర్స్ కి ముద్దుల కూతురే కాదు ముద్ధుల చెల్లి కూడా. చిరు ని డాడీ అంటూ పిలిచే నీహారిక చేసే అల్లరి ఆ ఫ్యామిలీలో అందరికీ వెయ్యి వాట్ల ఎనర్జీని ఇస్తుంది. ఇక తండ్రి నాగబాబు తో కలిసి బుల్లి తెరమీద చేసే సందడి అయితే అంతా ఇంతా కాదు. నాగబాబు గారి గారాల పట్టి నీహారిక ఎంతో హైపర్ యాక్టివ్ అన్న సగంతి ఎప్పుడో అందరికీ అర్థమైపోయి ఉంటుంది.

 

ఇక తను మాట్లాడే మాటలకి బాబు గారు చేసే ఎంజాయ్ మామూలుగా ఉండదు. అయితే ఎంతమంది ఉన్నా తండ్రి మీద చిన్న మాట పడనీక పోవడం నీహా గట్స్ కి నిదర్శణం. జబర్ధస్త్, అదిరింది షోల గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్స్ చేస్తుంటే వాళ్ళందరికి పవర్ స్టార్ రేంజ్ లో ఒకే ఒక్క డైలాగ్ తో నోరు మూయించింది. తన తండ్రి లేకపోతే జబర్ధస్త్ అన్ని సంవత్సరాలు నడిచేది కాదని కంప్లీట్ క్రెడిట్ మా డాడీదే. ఆయన షో కోసం చాలా కష్ట పడ్డారు. ఇన్నేళ్ళ కష్టానికి ఇలా మాట్లాదుతున్నారు. ఎవరెన్ని మాట్లాడిన్నా మా డాడి లేకపోతే ఈ షోస్ ఉండేవి కాదని ఇలాంటి పిచ్చి కామెంట్స్ అన్ని మా డాడీకి జూ జూబీ అని సెటై వేసింది. దటీజ్ మెగా డాటర్.  

మరింత సమాచారం తెలుసుకోండి: