తమిళ హీరో దళపతి  విజయ్ కి కోలీవుడ్ లో ఎలాంటి ఫాలోయింగ్ వుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల  వరస బ్లాక్ బాస్టర్ హిట్లు కొడుతుండడంతో  ఈ ఫాలోయింగ్ మరింత ఎక్కువైయింది. దాంతో సౌత్ లోనే ఏ హీరో కు లేన్నతంగా  విజయ్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ నుపెంచుకున్నాడు. ఇక తాజాగా విజయ్ కు ఎలాంటి క్రేజ్ వుందో మరోసారి బయటపడింది. ప్రస్తుతం విజయ్ ,మాస్టర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
 
గత కొద్దీ రోజుల నుండి ఈ సినిమా నైవేలి అనే ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది. విజయ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. దాంతో విజయ్ వచ్చాడని  తెలుసుకొని కొన్ని వేల సంఖ్య లో ఫ్యాన్స్  షూటింగ్ స్పాట్ చేరుకున్నారు.  వారిని ఆపడం పోలీసుల వల్ల కూడా కాలేదు. ఇక ఆ జన సమూహాన్ని చూసి విజయ్ కూడా ఆశ్చర్య పోయాడు వెంటనే  విజయ్ పక్కనే వున్న వ్యాన్ పైకెక్కి అక్కడికివచ్చిన వారందరకీ అభివాదం చేసి వారందరూ కనిపించేలా ఓ సెల్ఫీ దిగాడు. ప్రస్తుతం ఈ సెల్ఫీ  సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఇక ఆ సెల్ఫీ ని చూసిన మిగితా హీరోలు కూడా విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి షాక్ అవుతున్నారు. 
 
ఇదిలావుంటే ప్రస్తుతం మాస్టర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ అయిపోయిందని సమాచారం. ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్  డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తుండగా పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా  నటిస్తుంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎక్స్ బి క్రియేటర్స్ నిర్మిస్తుంది. ఏప్రిల్ లో ఈ చిత్రం తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: