సమంత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా ఆమె టాప్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. భారీ పారితోషికాన్ని అందుకుంటూ ప్రస్తుతం అక్కినేని కుటుంబ కోడలుగా ఎదురులేని స్థానానికి చేరుకున్న ఈమె ఇండస్ట్రీలో ఇక కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటాను అని చెప్పడంతో భవిష్యత్ లో ఈమె నటించే సినిమాలు ఎలా ఉంటాయి అన్న ఆసక్తికర చర్చలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి.


గత సంవత్సరం ఈమె నటించిన ‘మజిలీ’ మూవీలో ఆమె పాత్ర ఎంట్రీ సినిమా ఇంటర్వెల్ కు ముందు వచ్చింది. అదేవిధంగా గతవారం విడుదలైన ‘జాను’ మూవీలో కూడ సుమారు సినిమా మొదలైన చాల సేపటికి కానీ సమంత తన జానకి పాత్రతో ఎంట్రీ అవ్వలేదు. అయితే ఒకసారి సమంత ఎంటర్ అయిన తరువాత ప్రేక్షకులు అంతా సమంత పాత్రతోనే కనెక్ట్ అయిపోయారు. 


అయితే ‘జానూ’ ఆర్ధికంగా సక్సస్ కాలేదు. ఇలాంటి పరిస్థితులలో భవిష్యత్ లో సమంత తో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలు చేయాలి అని భావించే నిర్మాతలకు కథలు దొరకడం కష్టమే కాకుండా ఆర్ధికంగా విజయవంతం కాకపోతే భవిష్యత్ లో సమంత తో సినిమాలు తీసే నిర్మాతలు ముందుకు రావడం కష్టం. సమంత హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలుగా చేసిన ‘యూటర్న్’ ప్రస్తుతం రిలీజ్ అయిన ‘జాను’ ఆర్ధికంగా విజయం సాధించకపోయినా కేవలం సమంత హీరోయిన్ గా కనిపిస్తే చాలు ఆమె కోసం ధియేటర్లకు వచ్చే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు.


ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగంలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న టాప్ హీరోయిన్స్ లిస్టులో నయనతార అనుష్కల తరువాత సమంతకు స్థానం లభిస్తున్నా ఆమె సినిమాల ఆర్ధిక విజయంలో సమంత వెనుక పడుతోంది. దీనితో భవిష్యత్ లో సమంత తన హీరోయిన్ ఓరియంటెడ్ కెరియర్ ను కొనసాగిస్తూ ఆమె హీరోలతో సమానంగా ‘సార్’ స్థాయిలో  కొనసాగుతుందా లేదంటే ఆమె ‘ఆంటీ’ లుక్ లో ఉన్న డీ గ్లామర్ పాత్రలకు పరిమితం అయిపోతుంద అంటూ కొందరి విశ్లేషకుల సందేహం. ప్ర‌స్తుతానికి అయితే స‌మంత చేతిలో సినిమాలు ఏవీ లేవు. అమెజాన్ వెబ్ సీరిస్ ది ఫ్యామిలీ మ్యాన్ సెకెండ్ పార్ట్ లో స‌మంత నటిస్తోంది. ఇలా స‌మంత వెబ్ సీరిస్ ల వైపు తన దృష్టిని కొనసాగిస్తూ వాటితో పరిమితం అవుతుందా లేదంటే మరొకసారి ఏదైనా మరొకసారి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాతో తన ప్రయత్నాలు మళ్ళీ కొనసాగిస్తుందా అన్న విషయాలు రానున్న రోజులలో మాత్రమే తేలుతుంది..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: