దర్శకేంద్రుడు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ముందు హీరో ఎవరా అని ఆలోచించరు. హీరోయిన్ ఎవరా అని ఆరా తీస్తారు. అంతేకాదు పరిగెత్తుకుంటు సినిమాలకి వెళతారు. హీరోయిన్ నాభిని ఎలా చూపించాడో, ఏం తీసుకొని కొట్టాడొ అని ఆతృతగా వెళతారు. రాఘవేంద్ర రావు సినిమా అంటే ఖచ్చితంగా పూలు పళ్ళు హీరోయిన్ నాభి ...అనే మాట తలుచుకోని వారుండరు. ఇక ఆయన ఈ మధ్య కాలంలో సినిమాలు తీయడం లేదు. అయితే ఏదైనా ఒక సినిమా ఈవెంట్ జరుగుతుంది అంటే అక్కడ పొగడ్తలతో చంపేస్తారని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. నిజానికి ఏ ఈవెంట్ లో కూడా నెగెటివ్ పాయింట్స్ అసలు మాట్లాడరు. సినిమా ఎలా ఉన్నప్పటికీ డప్పు కొట్టడమే అసలు మ్యాటర్ అన్నటుగా చెలరేగిపోతూ ఉంటారు. బాగున్న విషయాన్ని బాగుందని చెప్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ క్లాసిక్ సినిమాలతో పోల్చడం మాత్రం అందరికీ నచ్చదు.  తాజాగా సీనియర్ దర్శకులు కె. రాఘవేంద్రరావు భా గారు 'జాను' సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు.

 

కానీ ఆ డోస్ బాగా ఎక్కువైపోయిందని అందరు అభిప్రాయపడుతున్నారు. 'జాను' సినిమాను ఏకంగా 'గీతాంజలి'.. 'పదహారేళ్ళ వయసు' సినిమాలతో పోల్చి..  శర్వానంద్-సమంతాలు కమల్-శ్రీదేవి లా నటించారు అంటూ అందరికి మైండ్ బ్లాకయ్యోలా కామెంట్స్ చేసి.. విస్తుపోయోలా చేశారు.  నిజానికి  'జాను' సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. స్లో నరేషన్ అని పెదవి విరుస్తున్నారు. కలెక్షన్లలో ఎక్కడ లేని నీరసం కనిపిస్తోంది. సినిమా ఒరిజినల్ లో 1996 నాటి ఎపిసోడ్ ను మార్చి ముందుకు జరపడం గజిబిజీగా మారిందని.. శర్వానంద్  ఏజ్ సరిపోలేదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక కొంతమంది డిజాస్టర్ అన్న మాటా అంటున్నారు. రిలీజైన రోజు నుండే అబ్బే అన్న మాట బాగా వినిపించింది. 

 

అయితే ఇక్క శర్వానంద్.. సమంత ఇద్దరు కూడా మంచి పెర్ఫామర్స్.  అందులో అనుమానం లేదు కానీ డైరెక్ట్ గా కమల్.. శ్రీదేవితో పోల్చడం మాత్రం అతిశయోక్తి తప్ప మరొకటి కాదని సోషల్ మీడియాలో అభిప్రాయాలు కుప్పలు తెప్పలు గా వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే 'గీతాంజలి'.. 'పదహారేళ్ళ వయసు' సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాలు నమోదు చేసిన సినిమాలు. 'జాను' ఫ్లాప్ దిశగా పయనిస్తున్న సినిమా. ఎంత సీనియర్ దర్శకులైనా ఈ లాజిక్కులు మర్చిపోతే ఎలా ..అని సెటైర్స్ వేస్తున్నారు. ఇక కొంతమందైతే ఇప్పుడు గనక సమంత సై అంటే దర్శకేంద్రుడు తన మీద కూడా పూలు పళ్ళతో దాడి చేస్తారని అంటున్నారు. చెప్పలేం జరిగినా జరగొచ్చు.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: