కొందరు హీరోయిన్స్ ఎలా ఉన్నా మంచి అవకాశాలు వస్తాయి. టాలెంట్ ఉంది అందం అభినయం చూపించినా కొందరికి మాత్రం అసలు లక్ కలిసి రాదు. అలాంటి హీరోయిన్స్ గురించి మాట్లాడితే ముందు ప్రస్తావించే పేరు ప్రగ్యా జైశ్వాల్. కంచెతో ప్రేక్షకులను మెప్పించిన ఈ అమ్మడు లీడ్ హీరోయిన్ కన్నా సైడ్ పాత్రలకే పరిమితం అవుతుంది. 

 

బోయపాటి శ్రీను జయ జానకి నాయక సినిమాలో కూడా చిన్న రోల్ తో సరిపెట్టుకున్న ప్రగ్యా మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. అయితే లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబో మూవీలో ఛాన్స్ అందుకుందట. ఈ మూవీలో కూడా ప్రగ్యా మెయిన్ లీడ్ హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ గా తీసుకుంటున్నారట. పవన్ ఛాన్స్ వచ్చిందని సంబర పడాలా లేక మళ్ళీ సైడ్ హీరోయిన్ అని నిరాశ పడాలా అన్నది తెలియక సతమతమవుతుంది. 

 

అయితే అసలు ఈ ఛాన్స్ అయినా కూడా క్రిష్ వల్లే వచ్చిందని అంటున్నారు. కంచె నుండి క్రిష్ ప్రగ్యా లు టచ్ లో ఉన్నారట. అందుకే ఆమెకు పిలిచి మరి ఛాన్స్ ఇస్తున్నాడు. ఇక సినిమా విషయానికి వస్తే పవన్ పింక్ రీమేక్ గా చేస్తున్న వకీల్ సాబ్ రిలీజ్ కాగానే క్రిష్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మూవీలో పూజా హెగ్దేని హీరోయిన్ గా తీసుకుంటారని టాక్. పవన్ సినిమాతో అయినా ప్రగ్యా ఫేట్ మారుతుందేమో చూడాలి. ఎలాగు సినిమా ఛాన్సులు రావట్లేదని రెండు రోజులకు ఒక కొత్త ఫోటో షూట్ తో అందాల ప్రదర్శన చేస్తుంది అమ్మడు. తన ఈ లేటెస్ట్ ఫోటో షూట్ అయినా ప్రగ్యా కు ఛాన్సులు వచ్చేలా చేస్తాయో లేదో చూడాలి. పవన్ సినిమా చేస్తే మాత్రం మళ్ళీ అమ్మడు ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: