‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా విడుదల తేదీ మారిపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంభందించి  చాలా లెక్కలు మారిపోయాయి. ఇక చరణ్ జూనియర్ ల అభిమానులు కూడా తమ హీరోలను చూడటానికి మరో ఏడాది వేచి చూడాలని మెంటల్‌ ‌గా ఫిక్స్ అయిపోయారు. 


ఇలాంటి పరిస్థితులలో రాజమౌళి వచ్చే ఏడాది జనవరి వరకు జూనియర్ లు తన వద్దనే ఉంటూ ఎటువంటి కమిట్ మెంట్స్ పెట్టుకోకూడదు అని రాజమౌళి పెట్టిన లేటెస్ట్ కండిషన్స్ తో చరణ్ జూనియర్ లతో సినిమాలు తీయబోతున్న అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ నిర్మాణ సంస్థలుగా పేరు గాంచిన మైత్రీ మూవీస్ యూవీ క్రియేషన్స్ ఈ ఏడాది ఆగష్టు నుండి ఒకరు జూనియర్ తో మరొకరు చరణ్ తో మొదలు పెట్టాలి అనుకున్న మూవీ ప్రాజెక్ట్స్ వచ్చే ఏడాది మార్చి వరకు వాయిదా పడటంతో ఈ రెండు నిర్మాణ సంస్థలకు రొటేషన్ ఆగిపోతుంది అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వస్తున్నాయి. 


టాప్ హీరోలతో సినిమాలు తీసే భారీ నిర్మాణ సంస్థలు ఆ మూవీల వల్ల లాభాలు కన్నా డబ్బు రొటేషన్ బాగా జరుగుతుందని ఆశ పడతారు. ఇప్పుడు ఈ రెండు నిర్మాణ సంస్థలకు ‘ఆర్ ఆర్ ఆర్’ వాయిదా ఊహించని షాక్ అని అంటున్నారు.


వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల వాయిదా వల్ల చిరంజీవి కూడ నష్టపోతున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. బయటకు రాని ‘సైరా’ నష్టాలు కవర్ చేయడానికి చిరంజీవి కొరటాల తో మూవీని త్వరగా పూర్తి చేసి ఈసంవత్సరం దసరా కు విడుదల చేయాలని భావించాడు. అయితే ఈ మూవీలో చరణ్ కూడ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్న పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అయ్యేంత వరకు చరణ్ నటించిన మరొక సినిమా ఏది విడుదల కాకూడదు అంటూ రాజమౌళి పెట్టిన కండిషన్ తో చిరంజీవి కొరటాల మూవీ కూడ వచ్చే ఏడాది సమ్మర్ కు వాయిదా పడుతోంది. ఇలా ఒక్క ‘ఆర్ ఆర్ ఆర్’ వాయిదాతో ఇండస్ట్రీలోని భారీ నిర్మాణ సంస్థలు అన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: