సినిమా అవార్డుల్లో ఆస్కార్ కి ఉన్న ప్రత్యేకతే వేరు.  నటి నటులలకి గాని, దర్శకులకి గాని తమకున్న డ్రీమ్ ఏంటని అడిగితే ఆస్కార్ గెలవాలని అంటారు. ఈ అవార్డులు ప్రత్యేకించి హాలీవుడ్ సినిమాల కోసమే అయినా అందులో ప్రపంచ సినిమాకి కూడా స్థానం కల్పించారు. అయితే ఈ అవార్డు భారతీయ సినిమాకి ఎన్ని సార్లు వచ్చిందో వేళ్ళ మీద లెక్కపెట్టగలం. విదేశీ భాషల జాబితాలో మన సినిమాలు ఆస్కార్ కి నామినేట్ అయినా కూడా ఆస్కార్ గెలుచుకోలేదు.

 

 


మనదేశంలో ఆస్కార్ అందుకున్న వారిలో ఏ.ఆర్.రెహమాన్ గురించి అందరికీ తెలిసిందే.. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్నాడు. అదే సినిమాకి ఉత్తమ గీత రచయితగా గుల్జార్ లాల్ నందాకి, సౌండ్ ఇంజనీర్ గా రసూల్ పోకుట్టి ఆస్కార్ గెలుచుకున్నారు. అయితే వీరి తర్వాత ఇప్పటి వరకు మన సినిమాలకి ఆస్కార్ రాలేదు. అయితే ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆస్కార్ బరిలో మన తెలుగు కుర్రాడు కూడా నిలబడ్డాడు.

 

 


అవును మీరు విన్నది నిజమే..ఆస్కార్ బరిలో నిలవడమే కాదు.. ఆస్కార్ గెలుచుకున్నాడు కూడా. సోమ‌వారం ప్ర‌క‌టించిన ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ వీఎఫ్ఎక్స్ పుర‌స్కారం 1917 సినిమాకు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ స‌మ‌కూర్చిన టీంలో ఇండియ‌న్స్ చాలామందే ఉన్నారు. అందులో అరుణ్ కుమార్ తెలుగువాడు. ఈ అరుణ్ కుమార్ టాలీవుడ్లో పేరుమోసిన పీఆర్వో, నిర్మాత బీఏ రాజు త‌న‌యుడు కావ‌డం విశేషం. 

 

 

ఆస్కార్ అవార్డుల ప్ర‌క‌ట‌న అనంత‌రం ప్రౌడ్ ఆఫ్ యు మై స‌న్ అంటూ రాజు త‌న త‌న‌యుడిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. 1917 టైటిల్ కార్డ్స్‌లో భాగంగా వీఎఫ్ఎక్స్ క్రెడిట్స్‌లో అరుణ్ కుమార్ అనే పేరు కూడా ఉంది. మనతెలుగు వాడు ఆస్కార్ అవార్డు అందుకున్న టీమ్ లో పనిచేయడం నిజంగా గొప్ప విషయమే.. అరుణ్ కుమార్ గతంలో లయన్ కింగ్ అనే సినిమాకి కూడా వీఎఫ్ఎక్స్ విభాగంలో పనిచేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: