ప్రభాస్ జిల్ రాథా కృష్ణల మూవీ 1980 నేపధ్యంలో యూరప్ ప్రాంతంలో జరిగే ఒక ప్రేమకథ అయితే ‘సాహో’ ఫెయిల్యూర్ ఇచ్చిన అనుభవాలతో ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ను యూరప్ లో తీయకుండా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఒక ఫ్లోర్ ను యూరప్ గా మార్చివేసి అక్కడ ఈ మూవీ షూటింగ్ అంతా పూర్తి చేస్తూ పొదుపు చర్యలు పాటిస్తున్నారు.


ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న ప్రాంతం నుండి వస్తున్న ఒక లీక్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలోని ఒక పాట కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారట.  


అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఎకరం స్థలంలో ఒక చెరువును సృష్టించి అందులో బోటు సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ గ్రాఫిక్స్ లో ఆ సన్నివేశం యూరప్ లో తీసిన ఫీలింగ్ కలిగేలా డిజైన్ చేసినట్లు సమాచారం. దాదాపుగా 4 రోజుల పాటు ఈ బోటు లోనే ప్ర‌భాస్ పూజా హెగ్డే ల‌పై ఈ స‌న్నివేశాలు తీయ‌బోతున్నారు అని సమాచారం. 


ఆ త‌ర‌వాత‌ రైలు నేప‌థ్యంలో ఇంకొన్ని సీన్స్ తీస్తారు అనీ దీనికోసం యూరప్ లో ఉండే విలాసవంతమైన రైలు బోగీని పోలి ఉండే విధంగా ఇదే అన్నపూర్ణ స్టూడియోలో మరొక సెట్ వేసి అక్కడ మరికొన్ని రోజులు షూట్ చేసి ఆ సీన్స్ కు కూడ గ్రాఫిక్ మాయాజాలం అద్దుతారని తెలుస్తోంది. ‘రాధే శ్యామ్‌ అన్న టైటిల్ ఈ మూవీకి ఇప్పటికే ఫిక్స్ అయిన నేపధ్యంలో ఈ మూవీని త్వరగా పూర్తి చేసి ఏమాత్రం అవకాశం ఉన్నా దసరా రేసుకు తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి పూజ డేట్స్ తో క్లాష్ అవుతున్న పరిస్థితులలో ఈ మూవీ షూటింగ్ అనుకున్న వేగాన్ని అందుకోలేక పోతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: