సుమ పేరు విన‌గానే మ‌న‌కు గుర్తువ‌చ్చేది. బుల్లితెరలో చ‌క్క‌టి తెలుగులో గ‌ల‌గ‌లా మాట్లాడ‌గ‌లిగే ఓ యాంక‌ర‌మ్మ‌. అయితే ఈమె కూడా కెరియ‌ర్ మొద‌ట్లో కాస్త ఇబ్బందులు ప‌డింద‌ట‌. మ‌రి వాటి గురించి మ‌న‌తో పంచుకోవ‌డానికి ఇటీవ‌లె ఒక యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అస‌లు నిజాలన్నీ తెలిపింది ఈ యాంక‌ర‌మ్మ.  ఈమె కెరియ‌ర్ మొద‌లు పెట్టిన తొలినాళ్ళ‌లో అస‌లు యాంక‌ర్ అనే ప‌ద‌మే ఉండేది కాద‌ట‌. ఎక్క‌డ‌న్నా ఏద‌న్నా కార్య‌క్ర‌మంలో మాట్లాడాలంటే.. ఇక్క‌డ కొంచం మాట్లాడమ్మా అని చెప్పేవార‌ట‌. దాంతో త‌ర్వాత త‌ర్వాత దీనికి యాంక‌ర్ అనే ఒక ప‌దాన్ని చేర్చారు అన్నారు సుమ‌. 

 

అలాగే తాను చేసిన మొద‌టి షో జెమిని టీవీలో ఒన్స్ మోర్ అన్నారు. అలాగే మ‌హిళా ప్రోగ్రామ్స్‌లో తాను చేసిన షో మ‌హిళ‌లు మ‌హరాణులు అత్యంత టిఆర్పీ రేటింగ్స్‌తో ఆ షో కొన‌సాగింద‌న్నారు. అంతేకాక త‌ర్వాత ఆ షో స్టార్ మ‌హిళ‌గా పేరు మార్చార‌న్నారు. అంతే కాక ఆ షో దాదాపు 12 ఏళ్ల‌పాటు  సాగిన ఒకేఒక్క మ‌హిళా కార్య‌క్ర‌మంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు ద‌క్కించుకున్న‌ట్టు సుమ గ‌ర్వంగా చెప్పారు.

 

ఇక తెలుగులో తాను ఇంత అద్భుతంగా మాట్లాడ‌టానికి ప్ర‌ధాన కార‌ణం కేవ‌లం అప్ప‌ట్లో ఉన్న ద‌ర్శ‌క నిర్మాత‌లు, టెక్నీషియ‌న్లే కార‌ణ‌మ‌న్నారు. త‌న‌కు తెలుగు తెలియ‌క‌పోయినా వారు ఎంతో ఓపిక‌తో నేర్పించార‌న్నారు. వీరిలో  అంద‌రిక‌న్నా కాస్త ఎక్కువ‌గా ద‌ర్శ‌కుడు మీర్ పాత్ర చాలా ఉంద‌న్నారు. మొద‌ట్లో త‌న‌కు ‘బాధ’ అనే ప‌దాన్ని కూడా స‌రిగా ప‌ల‌క‌డం వ‌చ్చేది కాద‌న్నారు. ప‌దేప‌దే ‘బాద‌...బాద’ అని ప‌లికేదాన్న‌ని, అలా ప‌ల‌క‌కూడ‌ద‌ని ‘బాధ’ అని ప‌ల‌కాల‌ని చెప్పి నాటి పెద్ద‌లు  నేర్పించార‌ని సుమ త‌న‌ పాత రోజుల‌ను గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనంద‌ప‌డ్డారు. ఇక సుమ రాజీవ్ క‌న‌కాల భార్య అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆమెకు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: