సెన్సేషనల్ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌. డియర్‌ కామ్రేడ్ సినిమాతో నిరాశపరిచిన విజయ్సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఓనమాల, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి క్లాస్‌ సినిమాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్‌ ఈ సినిమాకు దర్శకుడు. విజయ్‌ నాలుగు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తున్న  సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది.

 

అయితే ఈ ట్రైలర్‌లో ఎక్కువగా అర్జున్‌ రెడ్డి ఛాయలు కనిపించటంతో అభిమానులు పెదవి విరిచారు. ప్రేమికుల రోజు కానుకగా ఈనెల 14న వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ మీడియా సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది.

 

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని స్టార్‌ ప్రొడ్యూసర్స్‌ కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. దీంతో ఒక్కో సినిమా విజయ్‌ ఞ కోట్లకు పైగానే పారితోషికం డిమాండ్‌ చేస్తున్నాడట. అయితే ఇంత క్రేజ్‌ ఉన్న విజయ్‌ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ విషయంలో మాత్రం చాలా తక్కువ పారితోషికమే తీసుకుంటున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది.

 

విజయ్‌ గత చిత్రాలు ఫెయిల్యూర్స్‌ కావటంతో పాటు, ఈ సినిమా ప్రయోగాత్మకంగా తెరకెక్కుతుండటంతో రెమ్యూరేషన్‌ విషయంలో కూడా కోత పెట్టారట. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా నలుగురు హీరోయిన్స్‌ నటిస్తున్నారు. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసా బెల్లాలు విజయ్‌ ప్రియురాళ్లుగా కనిపించనున్నారు. మరి  ఈ సినిమా అయిన విజయ్‌ దేవరకొండ కెరీర్‌ను తిరిగి గాడిలో పెడుతుందేమో చూడాలి. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీలోను రిలీజ్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: