ఎన్ని సినిమాలు చేసావన్నది ముఖ్యం కాదు.. ఎన్ని విజయాలు అందుకున్నావనేదే ముఖ్యం.. సినిమా ఇండస్ట్రీ మొత్తం విజయం చుట్టూనే తిరుగుతుంది. విజయం అందుకున్న వారిని ఆకాశానికెత్తేస్తుంది. అపజయం చవి చూసిన వారిని అక్కడే వదిలేస్తుంది. నీకు విజయాలు ఉంటేనే మరీ సినిమా వస్తుంది.. లేదంటే అక్కది నుండి అటే వెళ్ళిపోతారు. సినిమా అనేది వ్యాపారం కాబట్టి ఇక్కడ అవకాశలు, సంబంధాలు అన్నీ వ్యాపారాత్మకమే..

 

 

యంగ్ హీరో శర్వానంద్ గత కొన్ని రోజులుగా వరుస పరాజయాలతో  సతమతమవుతున్నాడు. అయన నటించిన వరుస నాలుగు సినిమాల్లో మహానుభావుడు మినహా మిగతావన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. అంతకుముందు రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి లాంటి హిట్లతో జోరు మీద ఉండేవాడు. కానీ వరుస పహ్లాపులు ఎదురయ్యేసరికి డీలా పడ్డాడు.  దాంతో అతని మార్కెట్ బాగా దెబ్బతింది. నిర్మాతలు సర్వాతో సినిమా అంటే భయపడే స్థితికి వచ్చింది

 


అలాంటి టైమ్ లో వచ్చిన జాను శర్వాకి పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకున్న 96 సినిమాని తెలుగులో సమంత, శర్వానంద్ జంటగా జాను పేరుతో దిల్ రాజు నిర్మాతగా రీమేక్ చేశారు. ఈ సినిమాకి థియేటర్ల వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక క్లాసిక్ సినిమాని రీమేక్ చేసి మళ్ళీ అదే మ్యాజిక్ క్రియేట్ చేయడంలో  దర్శకనిర్మాతలు సక్సెస్ అయ్యారు. ఇందులో శర్వా నటనకి మంచి మార్కులు పడ్దాయి. పక్కన సమంతని పెట్టుకుని ఆమెకి ఏమాత్రం తీసిపోకుండా నటించి తనని తాను నిరూపించుకున్నాడు.

 

 

అయితే సినిమాకి రెస్పాన్స్ బాగున్నప్పటికీ కలెక్షన్లు వీక్ గా ఉన్నాయనే టాక్ వినబడుతోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. తమిళ 96 సినిమాని చాలా మంది అప్పటికే చూసేయడం ఒక కారణమయితే, సినిమాకి సరైన పబ్లిసిటీ చేయకపోవడం మరొక కారణంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: