ఆ మద్య తెలుగు లో నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ 3 లో భార్యాభర్తలు గా ఎంట్రీ ఇచ్చారు వరుణ్ సందేశ్, వితిక.  ఈ జంట చేసిన సందడి అంతా ఇంతా కాదు.. ప్రేమ, గిల్లి కజ్జాలు, పోటీ ఇలా అన్నింటిలో వితిక, వరుణ్ సందేశ్ తమ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు.  చివరిదాకా వరుణ్ సందేశ్ ఉన్నప్పటికీ.. వితిక మద్యలో వెళ్లిపోయింది.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్’ చిత్రంతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు వరుణ్ సందేశ్.  అమెరికాలో తన చదువులు పూర్తి చేసుకున్న ఈ హీరో మొదటి చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు.  ఆ తర్వాత కొత్త బంగారు లోకం చిత్రంతో మరో ఘన విజయం అందుకున్నాడు.

 

ఆ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా విజయం సాధించలేకపోయాయి.  మంచు మోహన్ బాబు, విష్ణు, మంచు మనోజ్,వరుణ్ సందేశ్, తనీష్ ప్రధాన తారాగణంగా ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాల  కాస్త పరవాలేదు అనిపించింది.  కానీ ఆ సినిమాలో వరుణ్ సందేశ్ కి పెద్దగా పేరు రాలేదు.  కాకపోతే గత ఏడాది వచ్చిన బిగ్ బాస్ 3 తో వరుణ్ సందేశ్ మరోసారి పాపులారిటీ సంపాదించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగులో నా తొలి చిత్రం 'హ్యాపీడేస్' .. సోలో హీరోగా చేసిన  చిత్రం 'కొత్త బంగారు లోకం'. తర్వాత నటించిన చిత్రాలు వరుస ఫ్లాపులు కావడంతో నాకు బ్యాడ్ టైమ్ మొదలైంది.   

 

దాంతో కాలం కలిసి రావడం లేదు .. ఈ సమయంలో నేను ఏ చిత్రం చేసినా ఫ్లాపు అవుతుందని భావించి గ్యాప్ తీసుకున్నాను.  అయితే నాకు రెమ్యూనరేష్ లేకున్నా పరవాలేదు.. మంచి కంటెంట్ దొరికితే నాకు పేరు వస్తుందని అనిపిస్తే అలాంటి  చిత్రంలో నటించడానికి నేను ఎప్పడూ రెడీ అని అంటున్నాడు ఈ కుర్ర హీరో. మరి అలాంటి కథ దొరకాలని.. మరోసారి వెండితెరపై వరుణ్ సందేశ్ మెరవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: