కేవలం హీరో వలన సినిమాలు ఆడే రోజులు చెల్లిపోయాయి. ఎంతటి వాడైనా హిట్ ఇస్తేనే మార్కెట్ ఉంటుంది, లేదంటే అంతే సంగతులు. సినిమా ప్రేక్షకుడిలో మార్పు... కధలో దమ్ము ఉంటేనే ధియేటర్ కి వెళుతున్నాడు. ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. సినిమా ఏమాత్రం అటు ఇటైనా.. మొదటి ఆటతోనే సరి, రెండో ఆటకు ధియేటర్ ఖాళీ... సూపర్ స్టార్ అయినా.. మెగా స్టార్ అయినా.. పవర్ స్టార్ అయినా.. నాచురల్ స్టార్ అయినా... ఎవరూ ఎక్కువ కాదు!

 

ఇటీవల.. సుమారుగా గత 5 6 సంవత్సరాలనుండి.. సూపర్ స్టార్ రజనీ కాంత్ కు సరియైన హిట్ లేక అతని మార్కెట్ కుదేలుమంది... మినిమం వసూళ్లు లేక బయ్యర్స్ నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల అయన  నటించిన ‘దర్బార్’ సినిమా మొదలైన దగ్గర్నుంచీ.. అన్నీ సమస్యలే ఎదురవుతున్నాయి. ఏదో ఒక రూపంలో దర్బార్ సినిమా గురించిన వార్తలు ట్రోల్ అవుతూనే ఉన్నాయి. ఎంతో ఆర్భాటంగా రిలీజ్ అయిన దర్భార్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయాన్ని అందుకోలేక పోయింది. 

 

దీంతో.. ఇటీవలే ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్ కూడా రజనీ ఇంటి ముందు నిరసన కూడా చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రభావం రజనీ కాంత్ రెమ్యునరేషన్‌పై పడిందని వినికిడి. సగానికి సగం పైనే కోత పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ హీరోగా తెరకెక్కుతోన్న ‘తలైవార్ 168’ చిత్ర బృందం రజనీ పారితోషికంపై కోత పెట్టిందనే వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతోన్నాయి. 

 

రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘తలైవార్ 168’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఖుష్బూ, మీనా హీరోయిన్లుగా నటిస్తుండగా, కీర్తి సురేష్ రజనీ కూతురిగా కనిపించనుంది. సన్ పిక్చర్స్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. 6 సంవత్సరాల క్రితం విడుదలైన రోబో ఫస్ట్ పార్ట్ తరువాత నుండి అయన నుండి విడుదలైన కోచ్చిదయన్, లింగ, కబాలి, కాల, రోబో 2 , పేట, దర్బార్ వరుస పరాజయాల పర్యవసానమే కోలీవుడ్లో సదరు నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: