ఈ మద్య ఎక్కడ చూసినా మహిళలపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయి.  ప్రతిరోజూ ఈ వార్తలు వినీ వినీ బాధపడటం.. కన్నీరు పెట్టుకోవడమే జరుగుతుంది.  మహిళలపై అఘాయిత్యాలకు పడేవాళ్లకు ఇటీవల దిశ కేసులో జరిగిన ఎన్ కౌంటర్ మాదిరిగా జరిగితే కొంత ఫలితం ఉంటుందని మహిళా సంఘాలు భావిస్తున్నారు.  కానీ అలా జరిగి మానవ హక్కుల సంఘాల వారు మరో యాంగిల్ లో అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.  ఏది ఏమైనా కేవలం సామాన్య మహిళలకే కాదు.. సెలబ్రెటీలకు సైతం ఈ తిప్పలు తప్పడం లేదు. బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం నేపథ్యంలో పెద్ద ఉత్తున లైంగిక బాధలకు గురి అయిన వారు ఉద్యమించారు. 

 

ఈ నేపథ్యంలో కోలీవుడ్ లో సింగర్ చిన్మయి మీ టూ ఉద్యమం నేపథ్యంలో ప్రముఖ రచయిత వైర ముత్తుపై సంచలన ఆరోపణలు చేసింది.  ఆ తర్వాత తన తోటి సింగర్ కార్తిక్ పై కూడా సంచలన ఆరోపణలు చేసింది.  సింగర్ చిన్మయి ప్రముఖ గాయకుడూ మనో పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె... గడిచిన ఏడాదిన్నరలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని పేర్కొన్నారు . అంతేకాకుండా కార్తీక్, మనో మంచి సింగర్స్ కానీ, మంచి పురుషులు కాదంటూ చిన్మయి ఆరోపించారు.  చాలా రోజుల క్రితం సింగర్ మనోగారు నాకు ఫోన్ చేసి.... కార్తీక్ గురించి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరిని తీసుకొని తన ఇంటికి రమ్మని చెప్పారు.

 

ఈ వేధింపుల విషయం విని కార్తీక్ భార్య బాధపడుతుంది. తన కెరీర్ ను ఎందుకు నాశనం చేస్తున్నావు? నువ్వు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డావు. నీ తోటి వారిని ఇలా ఉద్దేశ పూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తే.. సోషల్ మీడియాలో వారి ఇమేజ్ దెబ్బతింటుందని హితవు చెప్పారు. అలాగే తను కూడా ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు అని చెప్పి, రాజి కుదర్చడానికి చూశారు. సింగర్ గా వాళ్లు అంటే నాకు ఎంతో గౌరవం..  అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ మంచి పురుషులు మాత్రం కాదు అని చిన్మయి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: