సినీ పరిశ్రమలో కొన్ని కొన్ని క్రేజీ కాంబినేషన్లు విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తాయి. అది ఏ భాషలో అయినా కావొచ్చు. ప్రస్తుతం తమిళంలో ఓ క్రేజీ న్యూస్ రెండు రోజులుగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్టార్ హీరో అజిత్ తో సీనియర్ అండ్ స్టార్ డైరక్టర్ కేఎస్ రవికుమార్సినిమా చేస్తున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో బాగా రౌండ్ అయింది. అజిత్ 61వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోందని ఇందుకు ఇద్దరి మధ్యా చర్చలు జరిగాయని సోషల్ మీడియాలో కేఎస్ రవికుమార్ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ వచ్చింది.

 

 

ఆ పోస్ట్ వైరల్ గా మారిపోయింది. ఈ వార్తలో నిజమెంతుందో అని కొంతమంది మీడియా ప్రతినిధులు ఈ విషయమై రవికుమార్ ను సంప్రదించగ.. ఇవన్నీ పుకార్లు.. దయచేసి ఎవరూ నమ్మోద్దు అని చెప్పాడట. ఇదే విషయాన్ని ఆయన తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా చెప్పుకొచ్చాడు. ‘నేను సన్ పిక్టర్స్ బ్యానర్లో అజిత్ తో సినిమా చేతున్నానన్న వార్త అబద్ధం. నాపేరుతో ట్విట్టర్ లో పోస్ట్ అయిన వార్త పూర్తిగా నిరాధారం. నాకు గతంలోనూ.. ఇప్పుడూ ట్విట్టర్ లో అకౌంట్ లేదు. ఫ్యాన్స్ కు నా మిత్రులకు, సినీ పరిశ్రమకు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాను’ అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.

 

 

ప్రస్తుతం కేఎస్ రవికుమార్ చాలా లీన్ పేస్ లో ఉన్నాడు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు కొన్నేళ్లలో హిట్ అయిన సందర్భాలు లేవు. దీంతో అజిత్ ఫ్యాన్స్ ఒకింత కలవరానికి గురయ్యారు కూడా. గతంతో అజత్ తో విలన్, వరులార్ సినిమాలు చేశాడు. ఈమధ్య తెలుగులో బాలకృష్ణతో జైసింహ, రూలర్ సినిమాలు తీశాడు. జైసింహ యావరేజ్ కాగా రూలర్ డిజాస్టర్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: