రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకున్నాడు. గుడ్ పర్ఫామర్ గా పేరు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో డిఫరెంట్ ఆటిట్యూడ్ తో అట్రాక్ట్ చేస్తుంటాడు. ఓపెన్ గా మాట్లాడటంలో విజయ్ స్టైలే వేరు. సింగిల్స్, డబుల్స్ ఇష్టం లేదంటున్న రౌడీ తన టార్గెట్ ఏంటో చెప్పకనే చెప్పుతున్నాడు. 

 

యంగ్ హీరో విజయ్ దేవరకొండ షార్ట్ టైమ్ లో క్రేజీ హీరో అయిపోయాడు. ఈ యంగ్ హీరో సినిమాల్లోని పాత్రల మాదిరిగానే రియల్ లో కూడా డిఫరెంట్ ఆటిట్యూడ్ తో యూత్ ని అట్రాక్ట్ చేస్తుంటాడు. ఓ విధంగా చెప్పాలంటే ఆటిట్యూడ్ విజయ్ దేవరకొండ ని యూత్ ఐకాన్ గా నిలబెట్టింది. ఉన్నది ఉన్నట్టు ఓపన్ గా మాట్లాడే ఈ హీరో మాటలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. 

 

విజయ్ దేవరకొండ న్యూ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ఈ వారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రిరిలీజ్ ఈవెంట్ లో రౌడీ హీరో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తనను హీరోగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన విజయ్ తన సినిమాల రిజల్ట్స్ విషయంలో హానెస్ట్ గా మాట్లాడాడు. అయితే ఈ యంగ్ హీలో స్టార్ అనిపించుకోవాలని ఉందనే విషయాన్ని చెప్పి చెప్పనట్టుగా చెప్పాడు. 

తనకు సింగిల్స్, డబుల్స్ తీసే ఓపిక లేదంటున్న విజయ్ దేవరకొండ ప్రతి సినిమాలో సిక్సర్ కొట్టేందుకే ట్రై చేస్తానంటున్నాడు. అంటే మరో గట్టి బ్లాక్ బస్టర్ పడితే స్టార్ అయిపోవచ్చనేది విజయ్ ఉద్దేశంగా కనిపిస్తోంది. లాస్ట్ టైమ్ బాక్సాఫీసు సిక్సర్ కొట్టలేకపోయిందన్న విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో సిక్స్ కొడతాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అయితే ప్రస్తుతం బంతి గాల్లో ఉందని.. సిక్సా.. కాదా అనేది ప్రేక్షకులే తేల్చాలని రౌడీ హీరో తెలివిగా మాట్లాడాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: