అదేంటో గానీ ఈ మధ్య స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పై ఎక్కువగా సిల్లీ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. కొందరు బన్నీ ఏది మాట్లాడినా.. ఏం మాట్లాడకపోయినా కాంట్రవర్శీ చేస్తున్నారు. ఆఖరికి తన ప్రమేయం లేకుండా కొత్త కొత్త కథనాలు అల్లేస్తున్నారు. సుకుమార్ తో బన్నీ చేస్తున్న కొత్త సినిమాకు సంబంధించి క్రేజీ రూమ ఒకటి ట్రెండ్ అవుతోంది.

 

అల వైకుంఠ పురంలో సినిమా స్టైలీష్ స్టార్ కెరీర్ లోన ది బెస్ట్ సక్సెస్ గా నిలిచింది. అంతేకాదు ఇండస్ట్రీ టాప్ ఫైవ్ లో ఒకటిగా చోటు దక్కించుకుంది. ఇంతటి ఘన విజయానికి ప్రధాన కారణం తమన్ అందించిన సంగీతమనే చెప్పాలి ఈ విషయాన్ని త్రివిక్రమ్, అల్లు అర్జున్ లు కూడా పబ్లిక్ గానే ఒప్పుకున్నారు. అయితే ఇఫ్పడు ఇదే విషయాన్ని ఆధారం చేసుకొని కొందరు బన్నీపై సిల్లీ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. 

 

ప్రస్తుతం టాలీవుడ్ లో థమన్ హవా కొనసాగుతోంది. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ట్యూన్స్ ముందు మరో మ్యూజిక్ డైరెక్ర్ ట్యూన్స్ నిలవలేకపోతున్నాయి. దీంతో స్టార్స్ నుండి మీడియం హీరోల వరకు అంతా థమన్ వెంట పడుతున్నారు. ఇదే క్రమంలో బన్నీ కూడా థమన్ తో మళ్లీ వర్క్ చేయాలని భావిస్తున్నాడట. ఇందులో భాగంగా సుకుమార్ సినిమాకు కూడా థమనే కావాలని బన్నీ పట్టుబడుతున్నట్టు న్యూస్ వైరల్ అవుతోంది. 

 

బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో న్యూ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆల్ రెడీ రెండు పాటల కంపోజింగ్ కూడా అయింది. ఈ టైమ్ లో దేవిశ్రీ ప్రసాద్ ను తప్పించి థమన్ ను తీసుకోవాలని బన్నీ, సుకుమార్ ను ఒత్తిడి చేస్తున్నట్టు ఓ సిల్లీ రూమర్ వినిపిస్తోంది. నిజానికి థమన్ కంటే దేవిశ్రీప్రసాదే, బన్నీ కెరీర్ లో ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: