అల్లు అర్జున్ ఎంత స్టైలిష్ గా కనిపిస్తాడో అంత సరదాగా కూడ ఉంటాడు. బన్నీ చాల స్టైలిష్ గా కనిపిస్తూ ఉండటంతో అతడి అభిమానులు అతడిని అభిమానంతో స్టైలిష్ స్టార్ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. బన్ని కాస్ట్యూమ్ సెలక్షన్ కి ఫిదా అవ్వని వారు ఉండరు. 


కేవలం దుస్తుల ఎంపిక మాత్రమే కాదు బాడీ లాంగ్వేజ్ పరంగా కూడ చాల డిఫరెంట్ గా కనిపించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. సందర్భం ఏదైనా క్యాజువల్ వేర్ డిజైనర్ వేర్ ఏది వేసుకున్నా తన స్టైల్ ను ఎలివేట్ చేసుకునేలా ప్రయత్నించే బన్నీ వెనుక ఒక అజ్ఞాత వ్యక్తి హస్తం ఉంది. అతడే అల్లు అర్జున్ పర్సనల్ స్టైలిస్ట్ హార్మన్ కౌర్.


ఇతడు ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  బన్నీ కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ను బయటపెట్టాడు.  బన్నీకి బ్లాక్ కలర్ అంటే బాగా ఇష్టం. ఆ రంగు డిజైన్స్ ను వేసుకోవడానికి బన్నీ బాగా ఇష్టపడతాడట. అంతేకాదు అతడి ప్రతి ఎంపికలోనూ బ్లాక్ కలర్ కామన్ గా ఉంటుంది. ఆ కలర్ బన్నీకి ఓ సెంటిమెంట్ గా మారిపోయింది అని హార్మన్ కౌర్ అంటున్నాడు. 


సినిమా ఓపెనింగ్ లకు హాజరవ్వాలన్నా ఇతర ఈవెంట్లకు వచ్చినా బన్నీ తన స్టైల్ ని బ్లాక్ లో ఎలివేట్ అయ్యేలా చూసుకుంటాడట. బ్లాక్ కలర్ తన దృష్టిలో ఒక బ్రాండ్ అని భావిస్తూ స్టైలింగ్ విషయంలో బన్నీ చాలా క్లారిటీగా ఉంటాడు అని అంటున్నారు. అంతేకాదు ఎవరైనా బ్లాక్ డ్రెస్ బన్నీకి బహుమతిగా ఇస్తే అతడు బాగా ఇష్ట పడతాడని ఈ విషయంలో బన్నీకి అతడి మామయ్యా చిరంజీవి స్ఫూర్తి అని తెలుస్తోంది. చిరుకి తెలుపు రంగు అంటే ఇష్టం. ఎదుటివారు బ్లాక్ ధరించడం ఇష్టం. అందుకే బన్ని బ్లాక్ ని ఎంపిక చేసుకుంటున్నాడు అంటూ హార్మన్ కౌర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మెగా అభిమానుల మధ్య హాట్ న్యూస్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: