సినిమా హిట్ అయింది అనుకోండి, ఫాన్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది...? అసలు ఈ సృష్టిలో ఆ దర్శకుడు ఒక గొప్ప సృష్టి. అవును మన తెలుగులో అభిమానుల సందడి చూస్తే అలాగే ఉంటుంది. తమిళంలో అయితే ఈ సినిమా కాకపోతే మరొక సినిమా అనుకుంటారు గాని మన డై హార్డ్ ఫాన్స్ అలా కాదుగా పాపం. సినిమా మీద ప్రాణం పెట్టుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇది కొంత వరకు ఉంటే బాగానే ఉంటుంది గాని అది మించితేనే చిరాకుగా ఉంటుంది. ఇప్పుడు అది మించింది అంటున్నారు పలువురు.


సంక్రాంతి కానుకగా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. అందులో స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. సినిమాను సినిమాగా చూస్తే బాగానే ఉంటుంది గాని, ఎక్కువ వసూళ్లు వచ్చాయని, ఒక దర్శకుడిని, ఒక స్టార్ హీరో అభిమానులు సోషల్ మీడియాలో పచ్చి బూతులు తిట్టారు. సినిమా వసూళ్లను పరువుగా చూడటం మొదలుపెట్టి దర్శకులను తిట్టే స్థాయికి ఫాన్స్ వెళ్ళిపోయారు. మిడిమిడి జ్ఞానంతో ఉండే అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో దాదాపుగా అదే విధంగా వ్యవహరిస్తున్నారు.



ఇప్పుడు ఇది దర్శకులను భయపెడుతుంది. అజ్ఞాతవాసి సినిమా సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఇలాగే తిట్టారు అభిమానులు. దీనితో ఇప్పుడు దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యాలి అంటే భయపడుతున్నారు. వ్యక్తిగత జీవితాన్ని కించ పరిచే విధంగా, కుటుంబ విషయాలను ప్రస్తావిస్తూ, తమ ప్రతిభను తక్కువ చేసి మాట్లాడుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అభిమానులు. మరికొంత మంది అయితే ఏకంగా బూతు పురాణాలు కూడా మొదలు పెడుతున్నారు.   దీనితో దర్శకుల్లో కొత్త భయం మొదలయింది. కొంత మంది స్టార్ దర్శకులు అయితే స్టార్ హీరోల సినిమాలకు దూరంగా ఉంటున్నారట. మరి ఎప్పుడు మారుతుందో ఈ వైఖరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: