తెలుగు చిత్ర పరిశ్రమలో పెళ్లి చూపులు సినిమా హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాలు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించి స్టార్ హీరోగా మారిపోయాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ను సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ఇక గీత గోవిందం సినిమా తో 100 కోట్ల హీరోగా కూడా మారిపోయాడు. ఆ తర్వాత టాక్సీవాలా సినిమా తో మరో హిట్  కూడా సాధించాడు. కాగా  మధ్యలో నోటా  డియర్ కామ్రేడ్ వంటి కొన్ని మార్పులు వచ్చినప్పటికీ... విజయ్ దేవరకొండ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో నటిస్తున్నారు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున విడుదల కానుంది. 

 

 

 

 కాగా  వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండ నాలుగు షేడ్స్ లో  కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాలో  కూడా విజయ్ దేవరకొండ ఇన్ని వేరియేషన్స్ లో  నటించలేదు.ఇక  ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన సినిమాపై  కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదేంటి తన సినిమా పై తానే కోపంగా ఉండటం ఏంటి అంటారా.. వెనుక పెద్ద స్టోరీ ఉంది. అదేంటంటే.. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పై అంతగా ఆసక్తి చూపకపోవడం కి కారణం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పారితోషికం అని వార్తలు వస్తున్నాయి.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ ప్రకారం ఐదు నుంచి ఏడు కోట్ల వరకు ప్రతి సినిమాకీ పారితోషికం విజయ్ దేవరకొండ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కోసం మాత్రమే అతి తక్కువ పారితోషికం తీసుకున్నారట విజయ్ దేవరకొండ. 

 

 

 

 ఎందుకంటే... అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన తర్వాత.. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ లు  నిర్మాత కె.ఎస్.రామారావు విజయ్ దేవరకొండకు ఇచ్చాడు. అయితే అప్పుడు విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ ప్రకారం పారితోషకం కోటి రూపాయలే ఉండేది. ఈ మూడేళ్లలో విజయ్ ఎన్నో విజయవంతమైన సినిమాలతో మరింత క్రేజ్ సంపాదించడంతో పారితోషికం కూడా పారితోషికం 10 రెట్లు పెరిగి పోయినది. ఈ నేపథ్యంలో పాత పారితోషికానికి ఈ సినిమా చేయాల్సి వచ్చిందట విజయ్ దేవరకొండకి. ఈరోజు క్రమంలోనే  వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పై విజయ్ దేవరకొండ అనాసక్తి గానే కనిపిస్తాడు అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.సినిమా కోసం  బలవంతం గా ప్రమోషన్ కూడా చేస్తున్నాడు అంటూ టాలీవుడ్ వర్గాల్లో  వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: