కొందరు మరణిస్తే అసలు గుర్తుకు రారు. మరికొందరు మరణించిన గానీ ఎప్పటికి గుండెల్లో, జ్ఞాపకాల్లో పదిలంగా నిలిచిపోతారు.. ఇలా చెప్పుకునే వారిలో నటి సౌందర్య ఒకరు.. సౌందర్య తెలుగు, తమిళం, కన్నడం మరియు మలయాళం భాషలలో మొత్తం కలిపి వందకు పైగా చిత్రాలలో నటించింది. పన్నెండు సంవత్సరాలు తిరుగులేని నటిగా వెలిగిన ఈమెకు అభినయంతో పాటుగా అందం కూడా మెండుగానే ఉన్నాయి.. తెలుగు చిత్రాల్లో విశేషాదరణను చూరగొన్న సౌందర్య మాతృభాష కన్నడలో నిర్మాతగానూ మారారు..

 

 

ఒక మెరుపు తారలా దూసుకు పోతున్న సమయంలో విధి చిన్న చూపు చూసిందో లేక అతిగా నచ్చేసిందో తెలియదు గాని పంచ భూతాలతో తన పని కానిచ్చుకుంది. ఆ సౌందర్యాన్ని తనలో కలిపేసుకుంది.. ఇకపోతే గడిచిన జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ వస్తున్న పరుచూరి గోపాలకృష్ణ గారు తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో సౌందర్యను గురించి మాట్లాడారు.

 

 

"సౌందర్య అంటే కదిలే అందం .. నిండు కుండవంటి వ్యక్తిత్వం ఆమె సొంతం. ఆమెను చూసినవాళ్లు అలాంటి అక్క .చెల్లెలు .. కూతురు వుంటే బాగుండుననుకునేలా జీవించారు.. ఇదే కాకుండా ఫలానా పాత్ర సౌందర్య చేస్తే చూడాలని అనుకునే అభిమానులు ఎందరో ఇప్పటికీ వున్నారు.

 

 

ఇకపోతే సౌందర్య మొదటి సినిమా నుంచి మాకు తెలుసు. ఆమెలో తొలి రోజుల్లో చూసిన వినయ విధేయతలనే చివరి వరకూ చూశాము. 2004లో ఏప్రిల్ 17వ తేదీన నేను డాక్టరేట్ అందుకోబోతుండగా, హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయిందని తెలిసింది. ఆ వార్త విని నేను తట్టుకోలేక పోయాను. నా కళ్ల ముందు ఎదుగుతూ వచ్చిన అమ్మాయి, హఠాత్తుగా అలా అదృశ్యం కావడాన్ని నేను జీర్ణించుకోలేక పోయాను" అని పరుచూరి గోపాలకృష్ణ గారు సౌందర్యను గుర్తు చేసుకుంటూ ఈ విధంగా తెలిపారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: