టాలీవుడ్ సూపర్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఫిబ్రవరి 14వ తారీఖున ఈ సినిమా విడుదల కానుంది. కె.ఎస్.రామారావు దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో దేవరకొండ పక్కన రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా సాగుతున్నాయి. ఒకపక్క ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న మరోపక్క తాను రౌడీ పేరిట చేస్తున్న బ్రాండ్ బట్టలను మరియు ఇంకా అనేక వాటికి సంబంధించిన వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా సొంత కంపెనీకి ఉంటూ ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాడు.

 

ఇటువంటి తరుణంలో తాజాగా ఈ రౌడీ బ్రాండ్ బట్టలు కి సంబంధించి మరియు ఇంకా అనేక వస్తువులకు సంబంధించి అభిమానుల మధ్య ప్రమోషన్ టైపులో విజయ్ దేవరకొండఈవెంట్ నిర్వహించాడు. ఈవెంట్ లో రౌడీ ప్రొడక్ట్స్ అన్నిటి గురించి అభిమానులతో ముచ్చటించాడు. రౌడీ టేప్ మరియు షూస్ అదేవిధంగా మగ్గులు కప్పులు లాంటి ప్రొడక్ట్స్ గురించి ప్రమోట్ చేస్తూ వాటిని అభిమానులకు ఇవ్వటం జరిగింది.

 

ఇటువంటి తరుణంలో స్టేజి పై తన షూస్ కూడా ఇచ్చిన విజయ్ తన బెల్ట్ అందరి ముందు విప్పి ఇవ్వటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అభిమానులతో చాలా సరదా సరదాగా విజయ్ దేవరకొండఈవెంట్ లో మాట్లాడటం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా హాజరవడం విశేషం. మరోపక్క ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్న విజయ్ దేవరకొండ సినిమా గురించి మరియు తన వ్యక్తిగత విషయాల గురించి మీడియా ముందు చెబుతున్నా విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: