ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రధాన సమస్య కరోనా వైరస్‌. ఇప్పటికే చైనాలో వందల మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. లక్షల మందికి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. దాదాపు 28 దేశాల్లో కరోనా వైరస్‌ సోకిన వారిని గుర్తించినట్టుగా అధికారికంగా వెల్లడైంది. కోరోనా అతి వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపింస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోను బాదితులకు సేవలదిస్తున్న వైద్యులకు ప్రతీ ఒక్కరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 

తాజాగా ఈ విషయం సీనియర్‌ హీరో రాజశేఖర్ స్పందించారు. కరోనా పేషంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులకు, నర్సులకు ధన్యవాదాలు తెలియజేశారు.  ఈ సందర్భంగా ఆయన ట్విటర్‌ వేదికగా వారిని అభినందించారు. `వైరస్ పై జరుగుతున్న ఈ యుద్ధంలో సైనికుల్లా పోరాడుతున్న వైద్యులు, నర్సులు, హెల్త్ వర్కర్లకు దండం పెడుతున్నా. ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఆరోగ్యపరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని దేవుడ్ని వేడుకుంటున్నా` అన్నారు. రాజశేఖర్‌ ట్వీట్‌పై ఆయన అభిమనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇప్పటి వరకు కరోనా వైరస్‌పై చాలా మంది సెలబ్రిటీలు రోగుల కోసం కష్టపడుతున్న వైధ్యులు, నర్సుల గురించి ప్రస్తావించిన వారు చాలా తక్కువ మందే. స్వతహాగా వైద్యుడైన రాజశేఖర్‌కు వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. అందుకే ఆయన ప్రత్యేకంగా వారిని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఇటీవల కల్కి సినిమాతో ఆకట్టుకున్న రాజశేఖర్ ప్రస్తుతం తదుపరి చిత్రంపై చర్చలు జరుపుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

 

రాజశేఖర్‌ వారసురాళ్లుగా ఆయన కూతుళ్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. చిన్నకూతరు శివాత్మిక దొరసాని సినిమా పరిచయం అయ్యింది. ప్రస్తుతం శివాత్మిక కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ మార్తండ సినిమాలో నటిస్తోంది. మరో కూతురు శివానీ ఇప్పటికే హీరోయిన్‌గా పరిచయం కావాల్సి ఉన్నా తొలి సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది.వీడి ప్రశాంతంగా ఉండాలన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: