టాలీవుడ్ లో 90వ దశకంలో టాప్ హిరోయిన్లలో ఒకరుగా ఎంతో మంది పేరు తెచ్చుకున్న నటీమణి సౌందర్య.  ఒకప్పుడు మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయిలో తన హావభావాలతో నటించి మెప్పించిన నటి సౌందర్య.  అమ్మోరు సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.  సహజ నటనతో సౌందర్య ఎన్నోె సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.  ఒక్కమాటలో చెప్పాలంటే..  ఇప్పుడు సౌందర్య అంటే అత్త, అమ్మ పాత్రల్లో ఎంతో గొప్పగా ఒదిగి ఉండేదని పలువురు నటీమణులు అంటుంటారు.  అయితే సినిమాల్లో నటిస్తున్న సౌందర్య అనుకోకుండా రాజకీయాల వైపు మనసు మళ్లడం.. దానికోసం ప్రచారానికి బయలు దేరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. 

 

అప్పట్లో ఆమె మరణించిందన్న విషయం తెలుగుసుకొని యావత్ తెలుగు ప్రేక్షకులు కన్నీరు మున్నీరు అయ్యారు.  టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది.  ఆమె మరణవార్త ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేనంత చెరగని ముద్ర వేశారు సౌందర్య.  తాజాగా సౌందర్య గురించి ప్రముఖ రచయిత, నటులు పరుచురి గోపాల కృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌందర్య అంటే కదిలే అందం .. నిండుకుండవంటి వ్యక్తిత్వం ఆమె సొంతం. ఆమె చాలా సినిమాలు చేసి ఉండొచ్చు. ఆమెతో కలిసి మేము ఎనిమిది సినిమాలకి పనిచేశాము. ఫలానా పాత్ర సౌందర్య చేస్తే బాగుండుననుకునే అభిమానులు ఇప్పటికీ వున్నారు.

 

2004లో ఏప్రిల్ 17వ తేదీన నేను డాక్టరేట్ అందుకోబోతుండగా, హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయిందని తెలిసింది.  ఆ వార్త విని నాకు ఒక్కసారే గుండె ఆగినంత పనైంది..  హఠాత్తుగా అలా అదృశ్యం కావడాన్ని నేను జీర్ణించుకోలేకపోయానని అన్నారు. సౌందర్య మొదటి సినిమా నుంచి మాకు తెలుసు. ఆమెలో తొలి రోజుల్లో చూసిన వినయ విధేయతలనే చివరివరకూ చూశాము.  తనకు ఎంతో మంచి పేరు వచ్చినా.. ఎలాంటి గౌరవం లేకుండా సినీ పరిశ్రమలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ పలకరించి బాగోగులు అడిగి తెలుసుకునే వారు.  అలాంటి నటీమణి చనిపోవడం టాలీవుడ్ ఎప్పటికీ మరువలేని విషయం అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: