దగ్గుబాటి వారసుడు గా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన... తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక  గుర్తింపును తెచ్చుకున్నారు. హీరోగా వరుస సినిమాలతో అదరగొడుతూనే...  మరోవైపు పైడి పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తన వైవిధ్యభరితమైన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం రానాసినిమా చేసినా ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో  రానా కంటే బాగా ఎవడు నటించ లేరు అనే భావన ప్రేక్షకుల్లో కలిగించాడు రానా దగ్గుబాటి. అయితే సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులని మెప్పించడమే కాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటాడు. అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉంటాడు. అయితే తమ అభిమాన హీరో ఆన్లైన్లో చాటింగ్ చేస్తున్నారు అంటే వారిని ఆకర్షించేందుకు నెటిజన్లు  బాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనే విషయం తెలుసిందే. 

 

 

 ఈ క్రమంలోనే కొంతమంది పాజిటివ్ కామెంట్లు పెట్టి పొగడ్తలతో అభిమాన హీరోల దృష్టిలో పడాలని చూస్తే ఇంకొంతమంది నెగిటివ్ కామెంట్ పెట్టి తమ అభిమాన హీరోల దృష్టిలో పడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్నాళ్ల క్రితం రానా ఓ  ఇంటర్వ్యూ కి  హాజరుగా పదవ తరగతి ఫెయిల్ అయినప్పటికీ  కూడా పట్టుదలతో అనుకున్నది నెరవేర్చుకోగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు.అయితే రానా ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడిన వీడియో ని రానాను టాగ్ చేస్తూ ఓ నెటిజన్  సోషల్  మీడియాలో పోస్ట్ చేసి పలు వ్యాఖ్యలు చేశారు. స్టూడియోలు వెనక ఉంటే  పదో తరగతి ఫెయిల్ అయినా అనుకున్నది సాధించ వచ్చు అంటూ కామెంట్ చేశారు. స్టూడియోలు నీ వెనక ఉండడం వల్లే ఈ స్థాయిలో ఉన్నావ్.. నీ వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్ వల్లే ప్రస్తుతం ఈ గౌరవం అంటూ ఓ వ్యక్తి పోస్ట్ పెట్టాడు. 

 

 

 అయితే దీనిపై స్పందించిన రానా కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. స్టూడియోలు బాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన కేవలం చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ దక్కుతుందేమో కానీ తర్వాత గుర్తింపు దక్కదు అంటూ రానా బదులిచ్చారు. నాకు ప్రస్తుతం ఉన్న గుర్తింపు అనేది నా టాలెంట్ తో నేను దక్కించుకున్నది స్టూడియోలు వెనుక ఉన్నంత మాత్రాన వచ్చినది కాదు అంటూ చెప్పుకొచ్చాడు రానా . ఇక రానా స్పందనలకు అటు  నెటిజన్ల నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తుంది . రానా  వ్యాఖ్యలకు  కొంత మంది మద్దతుగా కామెంట్ చేస్తే... కొంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: